వర్షం నీటిలో జంతువు శరీరం.. చివరి ట్విస్ట్ చూస్తే ఫీజులు అవుట్!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే షాక్ అవ్వక తప్పదు.తాజాగా ఇప్పుడు అలాంటి వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక జంతువు వరద నీటిలో ఉండి అందరికీ హడల్ పుట్టించింది.ల్యాడ్ బైబిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే వేలల్లో వ్యూస్, లైకులు వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో ఒక వరద నీటిలో ఒక జంతువు శరీరం వెల్లికల తిరిగి ఉండటం చూడవచ్చు.

సాధారణంగా జంతువు చనిపోతే ఇలాంటి పొజిషన్‌లో నీటిలో తేలియాడుతుంది.దీంతో ఏదో జంతువు చనిపోయి కొట్టుకు వచ్చిందని అందరూ ఆందోళన పడ్డారు.

Advertisement

ఈ క్రమంలోనే ఆ శరీరం కదలడం మొదలు పెట్టింది.చివరికి అది మళ్లీ పైకి గుండ్రంగా తిరిగి షాక్ ఇచ్చింది.

అప్పటికి గానీ ఈ జంతువు హిప్పో పిల్ల అని తెలియలేదు.అప్పటివరకు జంతువు చనిపోయి నీటిలో కొట్టుకొచ్చిందని, దాని వల్ల ఏమి రోగాలు వస్తాయో ఏమోనని చాలామంది భయపడ్డారు.

కానీ చివరికి అది కావాలనే హాయిగా పడుకుని ఎంజాయ్ చేస్తుందని తెలిసి షాక్ అయ్యారు.ఈ హిప్పో పిల్ల తన చేష్టలతో అందరికీ ఫీజులు ఎగిరిపోయేలా చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ జంతువు నీటిలో హాయిగా ఎంజాయ్ చేస్తుందని ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా.ఇంకొకరు ఇది చనిపోయినట్టు యాక్ట్ చేస్తూ అందరినీ భయపెడుతోందని కామెంట్ పెట్టారు.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement