ఆ ప్రాంతం లో ఎన్టీఆర్ రికార్డ్స్ ని బద్దలు కొట్టిన 'బేబీ'

చిన్న సినిమా గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం లాగ బద్దలైన చిత్రం బేబీ( baby ).

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్( Viraj Ashwin ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా మొదటి రోజు నుండి నేటి వరకు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.

మొదటి రోజుకి మించి రెండవ రోజు వసూళ్లు, రెండవ రోజు కి మించి మూడవ రోజు వసూళ్లు, ఇలాంటి ట్రెండ్ వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగడం ఇదే తొలిసారి.పెద్ద హీరోల సినిమాలు మరియు మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ స్థాయి ట్రెండ్ ఎప్పుడూ జరగలేదు.

మలయాళం లో రీసెంట్ గా 2018 సినిమాకి ఇలా జరిగింది.గత ఏడాది కాంతారా చిత్రానికి కూడా ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగింది.

మళ్ళీ ఆ రేంజ్ ట్రెండ్ ట్రేడ్ చూస్తున్నది ఈ సినిమాకే.

Advertisement

ఆరు రోజుల్లో 20 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కొన్ని ప్రాంతాలలో స్టార్ హీరోల సినిమాల వసూళ్లను కూడా దాటేయబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.ఉదాహరణకి ఉత్తరాంధ్ర ప్రాంతం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Young Tiger NTR )హీరోగా నటించిన అరవింద సమేత ( Aravinda Sameta )చిత్రం 2018 వ సంవత్సరం లో విడుదలై దాదాపుగా 7 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇప్పుడు ఈ వసూళ్లను బేబీ చిత్రం ఫుల్ రన్ లో బ్రేక్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

బేబీ చిత్రం ప్రతీ రోజు సగటున ఈ ప్రాంతం లో 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధిస్తుంది.ఇప్పటి వరకు ఈ చిత్రం ఇక్కడ 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

ఇదే రేంజ్ ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా ఫుల్ రన్ లో అరవింద సమేత ని క్రాస్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇకపోతే ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ బ్రో ది అవతార్ సినిమా విడుదల వరకు, మరో పేరున్న సినిమా విడుదల లేకపోవడం తో బయ్యర్స్ కి పండగే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.అప్పటి వరకు ఈ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంటున్నారు.కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ అంటే పెట్టిన ప్రతీ పైసాకి మూడింతలు లాభం అన్నమాట.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

వరుసగా పెద్ద సినిమాలు డిజాస్టర్ అవ్వడం తో ఢీలా పడిన టాలీవుడ్ మార్కెట్ మళ్ళీ ఈ సినిమా తో పుంజుకోవడం బయ్యర్స్ కి కాస్త ఉపశమనం కలిగించింది.

Advertisement

తాజా వార్తలు