కేశినేనికి క‌మ్మ ఈక్వేష‌న్‌తో చెక్ పెట్టిన బాబు ?

విజ‌య‌వాడ టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

ఎంపీ కేశినేని నాని త‌న కుమార్తె శ్వేత‌ను యేడాది క్రిత‌మే అప్ర‌క‌టితంగా మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసుకుని ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే నానికి ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం బ‌లంగా అడ్డు ప‌డుతోంది.తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌తో పాటు షేక్ నాగుల్ మీరాలు నానికి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్నాయి.

చివ‌ర‌కు కొన్ని డివిజ‌న్ల‌లో నాని ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి కార్పొరేట‌ర్ సీట్లు ఇచ్చారు.అదేంట‌ని ప్ర‌శ్నిస్తే చంద్ర‌బాబు 23 మంది ఎమ్మెల్యేల‌ను వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకోలేదా ? అని ప్ర‌శ్నించ‌డంతో పాటు బెజ‌వాడ టీడీపీకి తానే బాస్‌ను అని ప్ర‌కటించుకున్నారు.అయితే నానికి చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా చెక్ పెట్టిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

విజ‌యవాడ ప‌క్క‌నే ఉన్న గుంటూరు టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా పార్టీ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కోవెల‌మూడి ర‌వీంద్ర పేరును ప్ర‌క‌టించారు.

Babu Who Checked Keshineni With Kamma Equation,ap,ap Political News,latest News,
Advertisement
Babu Who Checked Keshineni With Kamma Equation,ap,ap Political News,latest News,

ర‌వీంద్ర క‌మ్మ వ‌ర్గం నేత‌.రాజ‌ధాని ప‌రిధిలో ఉన్న రెండు కార్పొరేష‌న్లలో ఒక కార్పొరేష‌న్ క‌మ్మ‌ల‌కు ఇస్తే ప‌క్క‌నే ఉన్న విజ‌య‌వాడ సైతం క‌మ్మ‌ల‌కే ఇస్తే వ్య‌తిరేక‌త వస్తుంద‌న్న కొత్త సూత్రం ఇప్పుడు మిగిలిన టీడీపీ నేత‌లు తెర‌మీద‌కు తీసుకు రానున్నారు.ఇదంతా చంద్ర‌బాబు వేసిన వ్యూహాత్మ‌క స్కెచ్చే అని తెలుస్తోంది.

అందుకే గుంటూరు మేయ‌ర్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి. కేశినేని కుమార్తె శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌లేద‌ని అంటున్నారు.

బాబు చాలా వ్యూహాత్మ‌కంగా క‌మ్మ స్ట్రాట‌జీతోనే క‌మ్మ నానికి చెక్ పెట్టేసిన‌ట్టే అంటున్నారు.

తాజా వార్తలు