నాగార్జున చేతిలో ‘బాహుబలి’

ప్రస్తుతం సినీ ప్రముఖుల నుండి సాదారణ ప్రేక్షకుల వరకు అంతా కూడా ‘బాహుబలి’ గురించే మాట్లాడుకుంటున్నారు.

టాలీవుడ్‌ జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాపై తెలుగుతో పాటు తమిళ మరియు బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది.

సినిమా ప్రారంభం నుండి కూడా ఈ సినిమాపై భారీగానే ఉన్నాయి.అయితే తాజాగా ట్రైలర్‌ విడుదల తర్వాత అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి.

ఈ సినిమాకున్న క్రేజ్‌ దృష్ట్యా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌కు భారీ డిమాండ్‌ ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏదైనా ఏరియాకు దక్కించుకోవాలని వందల సంఖ్యలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు పోటీ పడుతున్నారు.

ఇలాంటి సినిమా డిస్ట్రిబ్యూషన్‌ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కృష్ణ జిల్లాలో డిస్ట్రిబ్యూషన్‌ చేయబోతున్నాడు.

Advertisement

ఎంతో మంది పోటీ పడ్డాకాని, నాగార్జున ఈ సినిమాపై ఆసక్తి చూపడంతో నిర్మాతలు ఆయనకు ఈ సినిమాను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.కృష్ణ ఏరియాకు గాను ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా 2.5 కోట్లకు అధికంగా పలకలేదు.కాని ‘బాహుబలి’కి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈసినిమాను నాగార్జున ఏకంగా నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమాను పంపిణీ చేయబోతున్నారు.ఇక ఇతర ఏరియాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో అమ్ముడు పోతోంది.

Advertisement