బాహుబలి 2 ని డే 1 లో బీట్ చేసిన ఆర్ఆర్ఆర్‌.. డే 2, డే3 లో బీట్‌ చేయాలంటే ఏంత రాబట్టాలంటే!

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబలి 2 సినిమా వసూళ్ల ని బ్రేక్ చేయడం అంటే కచ్చితంగా ఎవరి వల్ల కాదు అది ఎవరికీ సాధ్యం కాదు అంటూ ప్రతి ఒక్కరు భావించారు.

ఒక వేళ ఆ రికార్డులను బ్రేక్ చేస్తే అది కేవలం రాజమౌళి సినిమా అవుతుంది.

రాజమౌళి కి మాత్రమే ఆ సినిమా వసూళ్ల ను బ్రేక్ చేసే సత్తా ఉంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు. బాహుబలి 2 రికార్డులను రాజమౌళి తన కొత్త సినిమా ఆర్‌ఆర్ఆర్ తో ఈజీగా బ్రేక్‌ చేస్తున్నాడు.

మొదటి రోజు వసూళ్ల విషయం లో బాహుబలి కి దాదాపుగా డబుల్ అన్నట్లుగా వసూళ్లు దక్కించుకున్న జక్కన్న రెండవ రోజు మరియు మూడవ రోజుల్లో కూడా ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.లాంగ్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా బాహుబలి 2 వసూళ్ల ను బ్రేక్ చేయడం అసాధ్యం అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.

దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను దక్కించుకున్న బాహుబలి 2 సినిమా కు సంబంధించిన రికార్డు మరో పది సంవత్సరాల వరకు సేఫ్ గా ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే రోజుల వారీగా మాత్రం బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేయడం ఆర్‌ఆర్ఆర్ సినిమా కు కష్టం కాక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇప్పటికే మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు చేసిన జక్కన్న కొత్త సినిమా రెండవ రోజు బాహుబలి 2 ని బ్రేక్ చేయాలి అంటే దాదాపుగా 73 కోట్ల రూపాయల వసూళ్ల ను స్వంతం చేసుకోవాల్సి ఉంటుంది.సినిమా కు వచ్చిన పాజిటివ్ టాక్ తో కచ్చితంగా ఆ మొత్తమును దక్కించుకుంటాడు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.

మూడవ రోజు బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేయాలి అంటే దాదాపుగా 76 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం సెలవు రోజు అవ్వడం తో కచ్చితంగా ఆ రికార్డు ను కూడా బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

కనుక మొదటి మూడు రోజుల విషయం లో ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ గా ఆర్‌ఆర్ఆర్ నిలువబోతుంది అంటూ ట్రేడ్ పండితులు నమ్మకంగా చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు