అయోధ్య కేసు తుది తీర్పు ఇంకా ఎప్పుడు?

సుదీర్ఘ కాలంగా హిందూ మరియు ముస్లీంల మద్య సాగుతున్న అయోధ్య వివాదంకు మరి కొన్ని రోజుల్లో ఫుల్‌స్టాప్‌ పడబోతుంది.

అయోద్యలో బాబ్రీ మసీదు ఉందని, ఆ భూమి ముస్లీంలకే చెందుతుందని ముస్లీంలు డిమాండ్‌ చేస్తుంటే ఛారిత్రాత్మక ఆధారాలను చూస్తుంటే ఆ ప్రదేశంలో రామ మందిరం ఉంది.

అందుకే ఆ ప్రదేశంను హిందూలకు కేటాయిస్తే రామ మందిరం నిర్మించుకుంటాం అంటూ హిందువులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.రెండు వర్గాల వారు వాదనలు వినిపించడం పూర్తి అయ్యింది.

సుప్రీం కోర్టు మరి కొన్ని రోజుల్లో తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది.సుప్రీం చీప్‌ జస్టీస్‌ గొగోయ్‌ రంజన్‌ తన పదవి నుండి ఈనెల 17న విరమణ పొందబోతున్నారు.

ఆయన రిటైర్‌ అయ్యే లోపు అయోధ్య కేసు తుది తీర్పు ఇచ్చి వెళ్తానంటూ ప్రకటించాడు.అందుకే ఎప్పుడెప్పుడు తుది తీర్పు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

మరో పది రోజుల్లో ఆయన రిటైర్‌ అవ్వనున్నారు.అంటే వారం రోజుల్లోనే తీర్పు వచ్చే అవకాశం ఉంది.

అందుకే దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో పోలీసుల భందోబస్తు భారీగా పెంచారు.వారంలో హిందూవులకు తీపి కబురు వినిపిస్తుందని బీజేపీ నాయకులు చాలా రోజులుగా చెబుతున్నారు.

ముస్లీంలు సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే ప్రకటించారు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!
Advertisement

తాజా వార్తలు