మామిడి పండ్లు తిన్నాక పొర‌పాటున కూడా వీటిని తీసుకోరాదు.. తెలుసా?

పండ్ల‌లోనే రారాజు అయిన మామిడి పండ్ల గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.వీటిని చూస్తే పిల్ల‌ల‌కైనా, పెద్ద‌ల‌కైనా నోరూరాల్సిందే.

వేస‌వి కాలంలో మాత్ర‌మే ల‌భించే మామిడి పండ్లు మ‌ధుర‌మైన రుచితో పాటు బోలెడ‌న్ని పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి.అంద‌కే ఆరోగ్య ప‌రంగా ఇవి అనేక ప్ర‌యోజ‌నాలు చేకూరుస్తాయి.

అయితే అంద‌రూ తెలుసుకోవాల్సిన విష‌యం ఏంటంటే.మామిడి పండ్లు తిన్నాక పొర‌పాటుకు కూడా కొన్ని ఆహారాలు తీసుకోరాదు.

మ‌రి ఆ ఆహారాలు ఏంటో.అస‌లెందుకు వాటిని తీసుకోరాదో.

Advertisement

ఇప్పుడు తెలుసుకుందాం.మామిడి పండ్లు తిన్న వెంట‌నే పెరుగు అస్స‌లు తీసుకోరాదు.

మ‌రియు ఈ రెండిటినీ క‌లిపి కూడా తీసుకోరాదు.మామిడి పండ్లు, పెరుగు ఒకేసారి తీసుకుంటే కొంద‌రిలో వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్నాయి.

మామిడి పండ్లు తిన్న వెంట‌నే కూల్ డ్రింక్స్ పొర‌పాటున కూడా తీసుకోకండి.ఎందుకంటే, ఈ రెండిటినీ వెంట‌వెంట‌నే తీసుకోవ‌డం వ‌ల్ల‌ బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరిగిపోతాయి.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు అది చాలా ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

మామిడి పండ్లు తిన్న వెంట‌నే కొంద‌రు వాట‌ర్ తాగుతుంటారు.ఇలా కూడా చేయ‌కూడ‌దు.వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు దెబ్బ తింటుంది.

Advertisement

దాంతో గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

అలాగే మామిడి పండ్లను తిన్నాక మ‌సాలా వంట‌కాల‌ను తీసుకోరాదు.మామిడి పండ్ల‌ను తిన్న వెంట‌నే మ‌సాలా వంట‌ల‌ను తీసుకుంటే కడుపు నొప్పితో పాటు తీవ్ర‌మైన అసౌకర్యాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది.పెగుల్లో ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చే రిస్క్ సైతం ఉంటుంది.

ఇక మామిడి పండ్ల‌ను తిన్నాక కాక‌ర కాయ‌తో చేసిన వంట‌కాల‌ను ఎవైడ్ చేయాలి.లేదంటే వికారం, వాంతులు, త‌ల‌నొప్పి, క‌ళ్లు తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

తాజా వార్తలు