ఈమె చూపించినా, చూసేదెవరు?

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికా గౌర్‌.

ఈమె హీరోయిన్‌గా తెలుగులో పలు సినిమాల్లో నటించింది.

ఆ సినిమాల్లో కొన్ని సక్సెస్‌ కాగా, మరికొన్ని ఫ్లాప్‌లుగా మిగిలాయి.ఈమె పలు చిత్రాల్లో నటించినా, వాటన్నింటిలో కూడా పద్దతిగా, చీర కట్టులో మాత్రమే కనిపించింది.

అయితే ఈమెకు గత కొన్ని రోజులుగా ఆఫర్లు రావడం లేదు.లడ్డుగా అవ్వడంతో పాటు, గ్లామర్‌ పాత్రలకు ఒప్పుకోక పోవడంతో ఈమెకు ఆఫర్లు రావడం లేదు అని తేలిపోయింది.

అవకాశాలు రాకపోవడంతో ఇక చేసేది లేక ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు సిద్దం అని ఈ అమ్మడు అంటోంది.ఈ అమ్మడు తాజాగా టాలీవుడ్‌లో ఉన్న సన్నిహితులతో తాను గ్లామర్‌ పాత్రలకు రెడీ అంటూ సందేశం పంపింది.

Advertisement

దాంతో ఈమెకు మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాలు రావచ్చని ఆమె సన్నిహితులు అంటున్నారు.అయితే బొద్దుగా, పొట్టిగా ఉండే అవికా అందాలను చూడాలని ఎవరు కోరుకోవడం లేదని, అవికా కష్టపడి అందాలను చూపించినా, పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

అయినా కూడా అవికా మాత్రం తన వంతు ప్రయత్నంగా ఒక సినిమాలో గ్లామరస్‌ పాత్రలో నటించాలని నిర్ణయించుకుంది.

Advertisement