గుట్ట పైఅంచు నుంచి సముద్రంలోకి దూకాడు.. అతడి బాడీకి ఏమైందో చూస్తే వణికిపోతారు!

ఆస్ట్రియా( Austria ) దేశానికి చెందిన ఫ్రీరన్నింగ్ అథ్లెట్, సోషల్ మీడియా సెన్సేషన్ సైమన్ హోర్స్ట్ బ్రన్నర్( Simon Horst Brunner ) అద్భుతమైన విన్యాసాలకు పేరుగాంచాడు.

ఇతనికి భయం అంటే ఏంటో తెలియదు.

మనిషన్న వారెవరూ చేయని సాహసాలు చేయడానికి ఇతను పూనుకుంటాడు.అయితే సైమన్ ఎప్పట్లాగానే ఇటీవల తన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఒక ప్రమాదకరమైన స్టంట్( Dangerous Stunt ) చేశాడు.

దురదృష్టవశాత్తు, అది బెడిసికొట్టింది.ఇంకేముంది తీవ్ర గాయాలతో మంచం ఎక్కాడు.

Austrian Man Triple Jumps Into The Sea From A High Cliff Details, Simon Horst Br

సైమన్ సెప్టెంబర్ 19న, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తాను 20 మీటర్ల ఎత్తున్న ఒక గుట్ట పైఅంచు నుంచి సముద్రంలోకి దూకినట్లు తెలిపాడు.అంతేకాదు ఆ జంప్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.అందులో సైమన్ గుట్టపై నుంచి దూకిన తర్వాత గాల్లో మూడుసార్లు పల్టీలు పడుతూ చివరికి సముద్రంలోకి దూకినట్లు కనిపిస్తుంది.

Advertisement
Austrian Man Triple Jumps Into The Sea From A High Cliff Details, Simon Horst Br

దాదాపుగా ఆ ప్రయోగం సఫలమైనా, నీటిలో పడిపోయినప్పుడు ఆయనకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.ఆ వీడియో చివరలో ఆయన ఆసుపత్రి పరుపు మీద ఉన్న దృశ్యం కనిపించింది.

అతని ఛాతీ భాగం మొత్తం ఎర్రగా కమిలిపోయింది.కొరడాతో వందల సంఖ్యలో దెబ్బలు కొట్టినట్లుగా అతని చర్మం ఎర్రగా మారింది.

తన మోకాళ్లకు కూడా గాయాలైనట్లు ఈ డేర్ డెవిల్ తెలిపాడు.

Austrian Man Triple Jumps Into The Sea From A High Cliff Details, Simon Horst Br

ఆయన షేర్ చేసిన వీడియోకి 70 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.సైమన్ తనకు కళ్లు తిరుగుతున్నాయని కానీ త్వరలోనే రికవరీ అవుతానని ఫాలోవర్లకు భరోసా ఇచ్చాడు.20 మీటర్ల ఎత్తు నుంచి దూకడంలో ఫెయిల్ అయ్యానని అతను తన వీడియోపై రాసుకొచ్చాడు.అయితే అభిమానులు సైమన్ త్వరగా రికవర్ కావాలని ఆశించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అతని ధైర్య సాహసాలను ప్రశంసించారు.అంతేకాదు, సాహసాలు చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

కొందరు ఆయన సేఫ్టీ గురించి ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు