భారత రాజకీయ వ్యవస్ధలో ప్రత్యర్థులపై కక్ష సాధింపు ఓ ఆయుధంగా మారిపోయింది.
అన్ని బాగున్నపుడు ఆహఓహో అనుకొనే పార్టీలు అదునుచూసుకొని కేసులపేరుతో వేడాడుకోవడమే దేశ రాజకీయ రంగస్థలం మీద ఇపుడు విరివిగా కనిపిస్తున్న దృశ్యం .
యుద్దంలో రహస్యంగా ప్రత్యర్థులను వేడాడటం ఒకప్పటి యుద్దనీతియైతే…రాజకీయ రంగస్థలం మీద ప్రత్యర్థులకు అన్నీ మంది మాగధుల చేత , తమ అనుకూల మీడియా చేత , రహస్య వేగుల చేత ముందే చెప్పి వేటాడటమే అధికార పార్టీలో ఉన్న పెద్దల నీతిగా మారుతున్న క్రమం నిలువెత్తు స్వార్థరాజకీయాలకు పరాకాష్టగా మారిపోయింది .నిజాయితీగా నేతల అవినీతిని వెలికితీస్తే అధికార పార్టీల నిబద్దతను ఎవరూ కాదనలేరు.కానీ తమ స్వార్థ ప్రయోజనాలకోసం , అధికార దాహంలో భాగంగా జరిగే దండయాత్రల్లో భాగంగా దర్యాప్తు సంస్థలను వాడుకోవడం దారికొచ్చిన తర్వాత దారి మారుతున్న కేసుల తతంతగమే ఈతరహ విధానాలను ప్రశ్నింపచేస్తున్నాయి .కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు ఆడుతున్న క్రమంలో మరోసారి తెలుగు రాష్ట్రలోని ఎపిసోడ్ తెరమీదకొచ్చింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు రిమాండ్ రిపోర్టులో చోటు చేసుకోవడంతో కేసు విశేష ప్రాధాన్యత సంతరించుకొంది.
ఈ స్కామ్ ఎలా జరిగింది , ఏమి జరిగింది, దీనిలో వాస్తవాలు ఏంటీ అనే అంశాలు పక్కకు పెడితే దీని చుట్టు అల్లుకున్న పరిణామాలపై ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సందర్భం .తెలంగాణ అధికార టీఆరెఎస్ ప్రభుత్వం మోదీ సర్కార్ కు విసురుతున్న సవాల్ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఒకటి .వాస్తవానికి ఢిల్లీలో కదిలిన ఈ లిక్కర్ డొంక ఆగస్ట్ లోనే అనూహ్యంగా తెరపైకి వచ్చింది .కవితపై ఉన్న ఆరోపణలు అప్పటిలో ఏ దర్యాప్తు సంస్ధ బహిర్గతం చేయలేదు .ఢిల్లీ బీజేపీ వ్యూహత్మకంగా కేంద్రంలోని పెద్దల మార్గదర్శకత్వంలో వీటిని ఒక్కసారిగా తెరమీదకు తీసకురావడం , బీజేపీ నాయకులు ఈ పేరు ప్రస్తావించడం జరిగింది .గత ఆగస్ట్ లో బీజేపీ నేత ,ఎంపి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ , మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా లు కవితకు ఈ స్కామ్ తో సంబంధం ఉందని , టీఆరెఎస్ ప్రభుత్వ కుటుంబసభ్యుల ప్రమేయం దీనిలో ఉన్నట్లు ఆరోపణలు గుప్పించారు .దీనిపై అప్పట్లో కవిత ఆరోపణలు చేసిన వారిపై న్యాయస్ధానాలను ఆశ్రయించనున్నట్లు కూడా ప్రకటించారు.ఆగస్ట్ ఆరోపణల క్రమంలోనే కవితను పార్టీ మారమని బీజేపీలోని కొందరు పెద్దలు ఎర వేసారనే ప్రచారం జరిగింది .దీనిపై కేసీఆర్ , కవితలు స్పందించడం, దీనిని బీజేపీ నేతలు కొట్టివేయడం జరిగింది .ఆగస్ట్ నుండి మొదలైన లిక్కర్ స్కామ్ పరంపర నిందితుడిగా ఉన్న అమీత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు చేర్చే క్రమం వరకు దారితీసింది .ఈ దర్యాప్తు ఎటువైపు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది .ఆరోపణలు లేదా సాక్ష్యాల సహితంగా మొదలయ్యే కేసుల వివరాలను వాటివాటి ప్రాథమిక దశను వెల్లడిస్తూ ఆయా దర్యాప్తు సంస్ధలు ముందుకెళుతుంటాయి.కానీ రాజకీయపరమైన అంశాలు మిళితమైన కేసులో దర్యాప్తు సంస్థల కంటే ముందే అధికారంలో ఉన్న పార్టీలు , వారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కేసు ఆరంభానికి ముందే హింట్ ఇవ్వడంతోనే ఈకేసులు , దాడుల వెనుక అసలు వ్యూహం ఏమిటన్నది అర్ధమవుతోంది.
అన్నిటికంటే ముఖ్యంగా గేమ్ ప్లాన్ అమలు చేస్తున్న అధికార పార్టీలు , అనుకూల సంస్ధలు కేసులు , దాడులు భవిష్యత్ ను కూడా ముందే జోస్యం చెప్పి తమకు అనుకూలమైన ఫలితాన్ని రాబట్టుకొనేందుకు తొక్కాల్సిన అడ్డదారులు అన్ని తొక్కడం దేశ రాజకీయ యవనికపై మనం ఇటీవల కాలంలో తరచుగా చూస్తున్నాం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న పొలిటికల్ గేమ్ ఫ్లాన్ దేశ రాజకీయాలకు కొత్తకాదు.గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రత్యర్థి పార్టీలు , ఎదురుతిరిగిన నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో పాటు జైలు పాలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి .తమపార్టీని ధిక్కరించాడని అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా జైలు పాలు చేసిందో అందరికి విదితమే .పార్టీ ఆదేశాలను పాటించడం లేదనే కారణంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆడిన గేమ్ మామూలు విషయం కాదు .జగన్ ను తమ దారికి తీసుకొచ్చేందుకు ఏఐసీసీ పెద్దలు గులాంనబీ ఆజాద్ , దిగ్విజయ సింగ్ , అహ్మద్ పటేల్ తో సహ కొందరు కీలక నేతలు ముందు జగన్ వారి కుటుంబసభ్యలను పిలిపించారు .దారికిరాపోవడంతో క్విడ్ ప్రోకో కేసు వచ్చే అవకాశం ఉందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసారు .ఆతర్వాత జగన్ పై కేసులు తప్పవంటూ రోజుకోరకమైన కథనాలు మీడియాలో వచ్చేలా చూడటం , అనుకూల వర్గాల్లో మౌత్ పబ్లిసిటీ ద్వారా విస్తృత ప్రచారం చేసారు.చివరికి ఏది ఫలితం లేకపోవటంతో అప్పటి మంత్రి శంకర్రావు చేత కోర్టులో పిటీషన్ దాఖలు చేయించడం అక్కడి నుండి వరుసగా జైలుపాలు చేసే వరకు ఓ సీరియల్ గా ఈ ఎపిసోడ్ నడిపించి కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజకీయాన్ని రసవత్తరం చేసింది .దర్యాప్తు సంస్థల కంటే ముందే అనుకూల మీడియా సంస్ధలు జగన్ కేసులో విచారణపై ముందే తీర్పులిచ్చే వాతావరణం కూడా అలుముకొనేలా చేసింది .సీబీఐ వేయబోయే ఛార్జీషీట్ వివరాలు కూడా ముందస్తుగానే మీడియా వార్తల్లో ప్రముఖంగా రావడం జరిగేది .ఆ తర్వాత వచ్చిన ఫలితాలేంటన్నది అందరికి తెలిసిందే .
మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కార్‌కి వచ్చిన తర్వాత కూడా ఈ తరహ విధానాలు మరింత విస్తృతంగా చోటుచేసుకుంటున్నాయి.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా మోదీ , అమిత్ షా లు కూడా ఈ మాదిరి ఆటలో ఇబ్బందులు స్వయంగా ఎదుర్కొన్నారు .దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈరోజు ఈమైండ్ గేమ్ పొలిటికల్ కేసులపై బలంగా నోరు మొదపకపోవడానికి కారణం వారి హయాంలో చేసిన ఈ వికృత క్రీడ నీడ వెంటాడటమే.ఇటీవల మహరాష్ట్రలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ మనీలాండరింగ్ కేసులు గానీ , కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎపిసోడ్ గానీ , జార్ఘండ్ లో హేమంత్ సోరేన్ , ఆమ్ అద్మీ నేతలపై జరుగుతున్న కేసుల , దాడులు గానీ ఈతరహ పరంపరే .ఐతే నేతలు అధికార దుర్వినియోగానికి, ఆశ్రిత పక్షపాతానికి , అవినీతికి పాల్పడితే కేసుల పెట్టడం చేయాల్సిందే.దర్యాప్తు సంస్ధలు విచారణ చేయాలి , దాడులు చేయాలి .వీటిలో నిష్పక్షిపాతంగా ఆయా సంస్ధలు రాజకీయ జోక్యం లేకుండా ముందుకెళ్లాల్సిందే .ఇదే ప్రజల అభిమాతం.కానీ ఉద్దేశ్యం పూర్వకంగా కక్ష సాధింపు చర్యలుగా జరుతున్న పరిణామాలు , రాజకీయ అంశాలతో ముడిపడుతున్న దర్యాప్తులపైనే విమర్శలు వస్తున్నాయి .నేతలపై కేసుల అంశాన్ని చట్టప్రకారం ముందుకు తీసుకెళ్లాల్సిన దర్యాప్తు సంస్ధలు , అధికార యంత్రాంగం కంటే ముందే రాజకీయ రంగస్థలంపై జరుగుతున్న పరిస్థితులు ఆశాజనకం కాదు .ముందే వివిధ మార్గాల్లో నేతలను బెదిరించి దారికొస్తే తమలో కలిపేసుకొని రాకుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకొనే పొలిటికల్ రంగస్థల ముచ్చట ప్రజాస్వామ్యానికి వాంఛనీయం కాదు .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy