హైదరాబాద్ కూకట్‎పల్లిలో ఎస్వోటీ కానిస్టేబుళ్లపై కత్తితో దాడి

హైదరాబాద్ కూకట్‎పల్లిలో ఎస్‎వోటీ కానిస్టేబుళ్లపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

సిక్కుల బస్తీలో ఇద్దరు ఎస్‎వోటీ కానిస్టేబుళ్లపై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

దాడిలో భాగంగా కానిస్టేబుల్ ఛాతిలో దుండగుడు బలంగా కత్తితో పొడిచాడు.మరో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు.కాగా ఓ కేసు దర్యాప్తు నిమిత్తం కానిస్టేబుళ్లు సిక్కుల బస్తీకి వెళ్లగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గాయపడిన కానిస్టేబుళ్లు రాజు, వినయ్ లుగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement
ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?