టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ "యువగళం" ( Yuva Galam )పాదయాత్ర కడప జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.
కడప జిల్లా ప్రొద్దుటూరులో నేడు లోకేష్ ( Nara Lokesh )పాదయాత్ర జరుగుతూ ఉండగా ఓ ఇద్దరు వ్యక్తులు లోకేష్ పై కోడిగుడ్డు విసరడం జరిగింది.
వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది.మరియు క్యాడర్ ఆ వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
దీంతో అక్కడే ఆగి లోకేష్ కాసేపు నిరసన తెలుపటంతో.స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది.
వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఈ పరిణామంతో కడప టీడీపీ కార్యకర్తలు( TDP ) కోపంతో ఊగిపోయారు.కోడిగుడ్లు విసిరిన వ్యక్తులను గుర్తించి వెంబడించి పట్టుకుని వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు ఆ యువకులను పోలీస్ స్టేషన్ కి తరలించారు.అయితే ఆ ఇద్దరు యువకులు తాము దాడి చేయలేదని లోకేష్ పాదయాత్ర చూడటానికి వచ్చినట్లు వాదిస్తున్నారు.
ప్రస్తుతానికి అయితే ఇది ఆకతాయిలు చేసిన పనిగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy