క‌దులుతున్న రిక్షాలో ఉన్న అమ్మాయిపై దారుణం.. ర‌గిలిపోతున్న నెటిజ‌న్లు...

ప్రస్తుత స‌మాజంలో ఆడ‌వారిపై జ‌రుగుతున్న అన్యాయాల‌ను చూస్తుంటే నిజంగానే చాలా బాధ‌గా అనిపిస్తోంది.

ఏకంగా న‌డిరోడ్డుమీదే వారిపై దైర్జ‌న్యాలు జ‌రుగుతున్నా కూడా ఆప‌లేని దుస్థితిలో స‌మాజం ఉంది.

ఇక ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి పాకిస్థాన్‌లో జ‌ర‌గ‌డం దుమారం రేపుతోంది.పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో ఎడ్ల బండి లాగుతున్న రిక్షాలో వెన‌క భాగంలో ఇద్ద‌రు అమ్మాయిలు కూర్చుని ప్ర‌యాణం చేస్తున్నారు.

ఇక్క‌డ వారితో పాటు ఓ చిన్నారి కూడా ఉంది.ఇక రాత్రి వేళ కావ‌డంతో కొంచెం ర‌ద్దీగానే ఉంది ఆ ఏరియాలో.

అయితే ఇలా జ‌నాల మ‌ధ్య నుంచి వెళ్తున్న ఆ రిక్షా వ‌ద్ద‌కు ఒకడు వేగంగా వ‌చ్చి రిక్షా ఎక్కి చివ‌ర‌న కూర్చున్న ఆ అమ్మాయి బుగ్గ మీద‌ ముద్దు పెట్టి రెప్ప పాటి వేగంతో మాయ‌మైపోయాడు.ఇక క్ష‌ణ‌కాలం జ‌రిగిన ఈ అనూహ్య ఘటనతో బాధితురాలు షాక్ అయిపోయింది.

Advertisement
Atrocities Against A Girl In A Moving Rickshaw Netizens Raging, Viral Video, Net

మ‌రీ ఇంత దారునంగా ఇలా చేయ‌డ‌మేంట‌ని వారు ఆశ్చ‌ర్య‌పోయారు.అయితే ఇలా వారి ద‌గ్గ‌ర‌కు వచ్చేందుకు మరో వ్య‌క్తి కూడా ప్రయత్నించగా ప‌క్క‌నున్న అమ్మాయి, బాధితురాలు ఇద్ద‌రూ కూడా చెప్పు తీయడంతో ఆ దుండ‌గులు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

Atrocities Against A Girl In A Moving Rickshaw Netizens Raging, Viral Video, Net

ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే ఆ దుర్మార్గుడు ముద్ద‌8ఉ పెట్టేముందు అసభ్య సంకేతాలు చేయ‌డంతో ఆ అమ్మాయిలు ఇద్ద‌రూ కూడా అటువైపు చూడ‌లేక ముందువైపు త‌మ చూపు తిప్పుకున్నారు.ఇక వారు తలలు ముందుకు తిప్ప‌డంతో ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు రిక్షా దగ్గరకు వెళ్లే సాహసం చేవాడు.ఇంకా చెప్పాలంటే ఈ దారుణం పాకిస్థాన్ దేశ స్వాతంత్ర్య దినోత్సవంమైన ఆగస్ట్ 14నే కావ‌డం ఇంకా సంచ‌ల‌నం రేపుతోంది.

ప్ర‌స్తుతం ఈ వీడియోను చూసి వారంతా కూడా ఇంత దారుణంగా పాకిస్థాన్‌లో మ‌హిళ‌ల ప‌రిస్థితి ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు