అవును, మీరు విన్నది నిజమే.ప్రపంచం ఎటుపోతోందో తెలియడం లేదు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ( Uttar Pradesh )జరిగిన ఓ దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
గర్భవతి అయిన యువతిని, ఆమె తల్లిదండ్రులు అత్యంత కిరాతకంగా చంపేశారు.
విషయం ఏమిటంటే, ప్రియుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఆమె నిరాకరించడమే ఆమె పాలిట శాపం అయింది.ఉత్తర్ ప్రదేశ్ మజాఫర్నగర్కు ( Mazzafarnagar )చెందిన ఓ 19ఏళ్ల యువతి ప్రేమలో పడింది.దానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించడంతో తన ప్రియుడు రాహుల్‌తో కలిసి.2022 అక్టోబర్‌లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది.ఈ క్రమంలో యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ తరువాత గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.డిసెంబర్లో ఈ ప్రేమ జంటను ట్రేస్ చేసి పట్టుకున్నారు.తరువాత యువతిని, ఆమె కుటుంసభ్యులకు అప్పగించి.
కావాలనే యువకుడిపై కిడ్నాప్, రేప్ కేసులు వేసి జైలుకు తరలించారు.ఈ కేసుపై కొంతకాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చిందని తేలింది.అయితే రాహుల్‌కు శిక్షపడాలని యువతి తల్లిదండ్రులు బలంగా కోరుకోవడం చేత కూతురు తన ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని అనేకమార్లు ఒత్తిడి చేశారు.
కానీ ఆమె దానికి అంగీకరించలేదు.
దాంతో ఆమె తల్లిదండ్రులు( parents ) ఆమెని చంపేయాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన కీలక విచారణ జరగాల్సి ఉండగా యువతి, ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లలేదు.అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా పోలీసులకు అసలు విషయం బయటపడింది.
రాహుల్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వనని కూతురు చెప్పడంతో తల్లిదండ్రులకు తీవ్ర కోపం వచ్చి సొంత బిడ్డను గొంతు నులిమి చంపేసినట్టు తెలుసుకున్నారు.అప్పటికి ఆమె 8 నెలల గర్భవతి.
చంపిన తరువాత యువతి మృతదేహాన్ని గోయ్లా గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో పడేశారు.పోలీసులకు విచారణలో భాగంగా జరిగిన తంతుని ఆమె తల్లిదండ్రులే ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy