ఎన్నికల్లో ఓటమి తప్పదనే వైసిపి నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు - అచ్చెన్నాయుడు

వైసిపి ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని ఎప్పుడు ఎన్నికలు జరిగిన టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఆదివారం శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విషయ.జగన్ కు కూడా తెలుసని అందుకే నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుకు శ్రీకారం చుట్టారు అని అన్నారు.

Atchennaidu Comments On Ycp Constituency Incharges Change, Atchennaidu , Ycp Con

చెల్లని పైసా ఎక్కడ ఉన్నా ఒక్కటే అన్న విషయం జగన్ గ్రహించాలని తెలిపారు.ముఖ్యమంత్రి తో సహా వైసిపి నాయకులు అందరూ అవినీతిలో కూరుకపోయారని అందుకే ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

ఈనెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లి లో జరిగే లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

Advertisement
మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!

తాజా వార్తలు