వినుకొండలో సీఎం జగన్ స్పీచ్ పై అచ్చెన్నాయుడు కౌంటర్ లు..!!

ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండలో "జగనన్న చేదోడు" కార్యక్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.ముఖ్యంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తోడేళ్లు గుంపు ఒకటవుతున్నాయని.కానీ తాను మాత్రం సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేయనున్నట్లు తెలిపారు.

భగవంతుని దయ.ప్రజలను నమ్ముకుని ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు జగన్ ప్రసంగించారు.దీంతో సింహం అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సింహం అనే డైలాగులు సినిమాలోనే బాగుంటాయని జగన్ తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు.

Advertisement

ఒంటరిగా ఉండటానికి.వెలివేయడానికి చాలా తేడా ఉందని తెలిపారు.తల్లిని చెల్లిని ఇంటి నుండి గెంటేసి నేను సింహాన్ని సింగల్ గా ఉంటానని చెప్పుకోవడం.

హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.చేసిన పాపాలు, పాల్పడిన దారుణాలు వేసిన భారాలు భరించలేక అందరూ నిన్ను దూరం పెడితే సింగిల్ గా మిగిలావు.

ఆ ఒంటరితనం నుండి వచ్చిన ఫ్రస్టేషన్ తో నేను సింహాన్ని సింగల్ గా వస్తాను అంటూ సినిమా డైలాగులు చెబుతున్నావు అంటూ ఎద్దేవా చేశారు.ఇటువంటి కల్లబొల్లి కబుర్లు నీ వాలంటీర్లకు చెప్పుకో.

నీ మాటలు ప్రజలెవరు నమ్మరు.మీ చెత్త పాలనకు చేసే ప్రసంగాలకు సభలకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

పోలీసులు అధికారులు లేకపోతే సభలో ఉండేది నువ్వు ఒక్కడివే అంటూ అచ్చెన్నాయుడు కౌంటర్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు