మోడీ నోట ఓటుకు నోటు మాట..షాక్ లో బాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో నిలపాలని తెగ ఆరాటపడుతున్నారు.

అయితే ఒక పక్క అభివృద్దికి నోచుకోని ఏపీ మరో పక్క ఒక్క అడుగు కూడా ముందుకు కదలని అమరావతి నిర్మాణాలు.

మరో పక్క ప్రభుత్వంపై వస్తున్న అవినీతి విమర్శలు.పోలవరం అసంపూర్తి నిరుద్యోగ సమస్య ఇలా ఒకటి కాదు రెండుకాదు అనేక మైన సమస్యలతో పార్టీని నెట్టుకుని రావాలంటే కష్టమే అయితే అందుకు చంద్రబాబు ఒక చక్కటి ప్లాన్ వేశారు అందులో భాగంగానే ఎన్డీయే నుంచీ బయటకి వచ్చేసి.

కేంద్రంపై పోరాటం చేసేసి ఏపీ కేంద్రాన్ని మోసం చేసేసింది అనే విమర్శలని ఎక్కుపెట్టి కేంద్రాని ఇరుకున పెట్టి ఏపీ ప్రజల ముందు పాపం బాబు అనిపించుకుంటే మళ్ళీ అధికారంలోకి రావడం చాలా సులభమే అనుకున్నారు అయితే ఇక్కడే బాబు కి చుక్కలు కనిపించాయి.ప్రతిపక్షాలు ఏమన్నా చేతులు కట్టుకుని బాబు గారు చేసేది చూస్తూ ఉంటాయా అందుకు తగ్గట్టుగానే బాబు చేసే ప్రతీ పనికి కౌంటర్ వేస్తూ వచ్చాయి.

వైసీపీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలోనే బాబు కూడా అవిశ్వాస నోటీసు ఇచ్చారు ఆ తరువాత తాజాగా నిన్నటి రోజున కేంద్రంపై అవిశ్వాసం మళ్ళీ ప్రకటించి పార్లమెంట్ లో బాలా బలాలు తేల్చుకున్న తరుణంలో అవిశ్వాసం వీగిపోయింది.అయితే

Advertisement

ఈ తరుణంలో టీడీపీ నేతలు మోడీ పై కేంద్రం పై చేసిన విమర్సలపై స్పందించిన మోడీ టీడీపీ కి దిమతిరిగే షాక్ ఇచ్చారు.ప్యాకేజీకి ఓకే చెప్పి ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం యూ టర్న్ తీసుకున్నారంటూ టీడీపీ పై విమర్శలు చేశారు.ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీగా మార్చాము.

ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి వున్నాం.ప్యాకేజీ మంచిదని తెదేపా నాయకుడు ఒకరు చెప్పారు.

ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు అంటూ ప్రశ్నలు సంధించారు మోడీ.మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పని చేశారని విమర్శించారు.

అంతేకాదు ఎన్నడూ లేని విధంగా ఓటుకు నోటి అంశంపై మొదటి సారి నోరు విప్పారు ఎన్డీఏ నుంచి తెదేపా తప్పుకున్నప్పుడు మీరు వైసీపిలో చిక్కుకున్నారని బాబుకు ఫోన్ చేసి చెప్పాను.అసలు వివాదం మొత్తం ఏపీలో వుంటే మీరు ఇక్కడ సభలో పోరాడుతున్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
పెళ్లి కొడుకే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజారిగా మారాడు.. వీడియో చూస్తే అవాక్కవుతారు!

ఓటుకు నోటు సంగతి మర్చిపోతారు.మీరు ప్రతీ విషయాన్ని మర్చిపోతారు అంటూ మోడీ ఓటుకు నోటు ప్రస్తావన తీసుకు వచ్చారు అయితే ఈ ప్రస్తావన ఎంతో వ్యూహాత్మకంగా బయటకి తీసుకు రావదానీకి కారణం టీడీపీ నేతల నోళ్ళు మూయించడానికా లేక బాబు టార్గెట్ చేశాము అని చెప్పడానికా అనేది అర్థం కాలేదు.

Advertisement

మొత్తానికి బాబు ని వదిలేదు లేదు అని చెప్పకనే చెప్పినట్టుగా ఉంది అంటున్నారు పరిశీలకులు.

తాజా వార్తలు