ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు..: కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం లేదని మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అన్నారు.కేసీఆర్( kcr ) ఎంపీగా పోటీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు.

ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు కేటీఆర్ పేర్కొన్నారు.రోజుకు పది అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఫిబ్రవరి 10వ తేదీ లోపు అన్ని సమావేశాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో నేత హైదరాబాద్( Hyderabad ) నుంచి వెళ్తారని చెప్పారు.సోషల్ మీడియాను తెలంగాణ బలగం పేరుతో ఏకం చేస్తామని వెల్లడించారు.

ఏప్రిల్ లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.కొత్త ప్రభుత్వంపై వేగంగా వ్యతిరేకత వస్తుందన్న కేటీఆర్ 420 హామీల అమలే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు.

Advertisement
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?

తాజా వార్తలు