పవన్ పిఠాపురంను ఎక్కడికో తీసుకెళ్లారు.. హీరో అశ్విన్ బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరో అశ్విన్ బాబు( Ashwin Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చాలామంది అశ్విన్ బాబు అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ స్టార్ యాంకర్ ఓంకార్ సోదరుడు అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

తెలుగులో పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అశ్విన్ బాబు.ఇది గత ఏడాది హిడింబా( Hidimba ) అనే సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

ఇకపోతే అశ్విన్ బాబు తాజాగా నటించిన చిత్రం శివం భజే.( Shivam Bhaje ) ఈ సినిమాతో ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Ashwin Babu Interesting Comments On Ram Charans Chirutha Movie And Pithapuram De

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే హీరో అశ్విన్ బాబు రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమా( Chirutha Movie ) సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు.అలాగే పిఠాపురంతో( Pithapuram ) తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

Advertisement
Ashwin Babu Interesting Comments On Ram Charans Chirutha Movie And Pithapuram De

ఈ సందర్భంగా అశ్విన్ బాబు మాట్లాడుతూ.రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాకు టికెట్స్ దొరక్కపోతే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లి పొద్దున్నే 4.30కి బెనిఫిట్ షో చూసాను.ఒకప్పుడు కాకినాడ దగ్గర పిఠాపురం అనే వాళ్లు.

ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు.

Ashwin Babu Interesting Comments On Ram Charans Chirutha Movie And Pithapuram De

నేను కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు అశ్విన్ బాబు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిని చూసిన మెగా భిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

మెగా ఫ్యామిలీ రేంజ్ అలాంటిది మరి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు