ఓరి దీని వేషాలూ . ఈ పాము యాక్టర్ల కంటే బాగా నటించేస్తోందిగా.. వీడియో వైరల్!

సాధారణంగా పాములను చూస్తేనే మనకు ఒంట్లో వణుకు పుడుతుంది.ఈ విష సర్పాలను చూసి భయపడటమే తప్ప ఎవరూ కూడా ఎంజాయ్ చేయరు.

ఎందుకంటే అవి ఎప్పుడూ భయంకరంగా కనిపిస్తాయి.కానీ ఒక పాము మాత్రం చిత్రంగా ప్రవర్తిస్తూ అందరి మనసులను దోచేస్తోంది.

ఈ పాము నటన కూడా నేర్చేసుకుని భలే వింతగా వేషాలు వేస్తోంది.తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

ముచ్చట గొలుపుతున్న ఈ వీడియోలో ఓ పాము తనని ఒక వ్యక్తి ముట్టుకోబోతుండగా తన నాలికను బయటపెట్టి చనిపోయినట్లు క్యూట్ గా నటిస్తోంది.ఈ రకం పాములను హాగ్నోస్ స్నేక్స్ అని పిలుస్తారు.

Advertisement
As The Snake Is Acting Better Than The Actors Snakes, Viral Latest, Viral News,

వీటికి నటించడం చిన్నతనం నుంచి స్వతహాగా వస్తుంది.ఇవి తమకు నచ్చినప్పుడు చనిపోయినట్లు ప్రవర్తిస్తాయి.

ఈ ఫన్నీ స్నేక్ వీడియోని వైరల్‌హాగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ షేర్ చేసింది.ఇప్పటికే ఈ వీడియోకి 90 వేల వ్యూస్ వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు డ్రామా క్వీన్, అమేజింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు దీన్ని చూసి ఓరి దీని వేషాలూ .అంటూ నోరెళ్లబెడుతున్నారు.

As The Snake Is Acting Better Than The Actors Snakes, Viral Latest, Viral News,

అయితే ఈ రకం పాములు అంతగా హానికరమైనవి కావని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.అందుకే విదేశాల్లో కొందరు వీటిని ఇష్టంగా పెంచుకుంటారు.అయితే ఈ పాముల్లో కొన్ని విషపూరితమైనవి ఉండొచ్చు.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఇవి డిఫెన్స్ చేయడంతోపాటు కప్పలు వంటి వాటిని కన్ఫ్యూజ్ చేసి పట్టుకునేందుకు ఇలాంటి జిమ్మిక్కులను ప్రదర్శిస్తాయి.కేవలం నటించడం మాత్రమే కాదు చనిపోయినట్లు ఇతర జీవులను నమ్మించేందుకు ఒకరకమైన వాసనలు వెదజల్లుతాయి.అన్ని పాముల్లో కెల్లా ఇంత డ్రామా చేసే పాములు ప్రపంచంలో ఎక్కడా లేవు అంటే అతిశయోక్తి కాదు.3- 4 అడుగుల పొడవు పెరిగే ఇవి న్యూమెక్సికో, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు