పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో ప్రజల వద్దకే పాలన..!!

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, నాణ్యత గురించి తెలియాలంటే అక్కడి ప్రజలను అడిగే తెలుస్తుంది.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ స్థాయిలో అందుతున్నాయో ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలే చెప్పాలి.

లేదా వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి చూస్తే అవగతం అవుతుంది.పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా చేసిన ప్రభుత్వ సేవలు పొందాలంటే పెద్ద పెద్ద క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

దరఖాస్తు తెచ్చుకునేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాలి.దాన్ని నింపిన తరువాత సరైన ఆధారాలు, పత్రాలు జతచేసి సంబంధిత కార్యాలయంలో ఇవ్వాలి.

ఇచ్చిన తరువాత పని జరగని పక్షంలో స్థానిక నేతల చుట్టూ తిరిగి అధికారి చేయి తడిపితే తప్ప దరఖాస్తులకు మోక్షం కలిగే అవకాశం లేదని తెలుస్తోంది.కులం సర్టిఫికెట్ అయినా, నివాసం, బర్త్, డెత్, ఇన్ కం ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇదే పరిస్థితులు ఉన్నాయని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
As An Example For The Neighboring States In AP Governance Rests With The People

అయితే ఏపీ ప్రభుత్వం( AP Govt ) మాత్రం ఇతర ప్రభుత్వాలకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు.ఏపీలో ప్రతిదీ గుమ్మం ముందుకే వస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

పెన్షన్లు మొదలు ప్రతి సంక్షేమ పథకం గడప ఎదుటకే వస్తాయి.గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడాల్సిన పని లేదు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు సంబంధించిన ప్రతి పనిని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తారు.విద్యార్థులకు కావాల్సిన సర్టిఫికెట్ల నుంచి వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ల వరకు ప్రతిదీ తెల్లవారేసరికే ఇంటి ముందుకు తీసుకువచ్చి అందిస్తున్నారు.

As An Example For The Neighboring States In Ap Governance Rests With The People

ఎవరి ప్రమేయం లేకుండా ఎటువంటి సిఫార్సులు, రికమెండేషన్లు లేకుండా నేరుగా అర్హులకు అందించే బాధ్యత అక్కడి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తీసుకుంటున్నారు.అర్హత ఉండి పథకం అందలేదని మాట ఏపీలో వినిపించదు.ఎక్కడా ఇసుమంతైనా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తుంది జగనన్న ప్రభుత్వం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సమన్యాయం చేస్తుంది వైసీపీ సర్కార్.ఏపీలో పరిపాలన చూసిన ఇతర రాష్ట్రాలు సైతం ఇది కదా సంక్షేమ, అభివృద్ధి పాలన అంటే అని అనుకుంటున్నారని తెలుస్తోంది.

Advertisement

ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడమే కదా పాలకుల బాధ్యత.అందుకే దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు ఏపీకి వచ్చి స్వయంగా ఇక్కడి పరిపాలన, సంస్కరణలు చూసి అబ్బుర పడుతున్నారు.

తమ రాష్ట్రాల్లోనూ ఈ విధంగానే పాలన అందిస్తామని చెబుతున్నారు.ప్రజారంజక పాలనను అందిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒక్క ఏపీలోనే కాకుండా యావత్ దేశంలోనే తనదైన పేరును ముద్ర వేసుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలతో ఏపీ ఖ్యాతి నలుదిక్కులా విస్తరించింది.చిన్నారుల నుంచి పండు ముదసలి వరకు ప్రతి ఒక్కరికీ చేయూతను ఇస్తూ సీఎం జగన్ ప్రతి ఇంటిలోనూ కుటుంబ సభ్యునిగా మారిపోయారని చెప్పొచ్చు.

దీంతో ఏపీ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

తాజా వార్తలు