వైరల్‌ వీడియో : బెంగళూరు రోడ్డుపై అంతరిక్షం, చందమామ చూపించిన నెటిజన్‌

విదేశాల సంగతి ఏమో కాని ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మరీ దారుణంగా ఉంటాయి.

హైవేలను అభివృద్ది అయితే చేస్తున్నారు కాని కొన్ని రాష్ట్రీయ రాహదారులను మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.

స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం పెద్దగా పట్టింపు లేకుండానే ఉంటున్నాయి.తమ రోడ్లను పట్టించుకోండి మహాప్రభో అంటూ ఎంతో మంది సోషల్‌ మీడియా ద్వారా చిత్ర విచిత్రమైన పోస్ట్‌లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

తాజాగా బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తమ ప్రాంతం రోడ్డు కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఒక ప్రయత్నం చేశాడు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియో రచ్చ రచ్చ చేస్తోంది.ఆ వీడియోలో అంతరిక్షంపై ఒక వ్యక్తి నడుస్తున్నట్లుగా ఉంది.ఆ వ్యక్తి అంతరిక్షంలో వాడే సూట్‌ను ధరించడంతో పాటు, అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా అయితే నడుస్తారో అలాగే నడుస్తున్నాడు.

Advertisement

కెమెరా అతడి పై భాగం నుండి తీయడంతో నూటికి నూరు శాతం అతడు ఒక చందమామపైనో లేదంటే ఏదో గ్రహం పైనో తిరుగుతున్నట్లుగా అనిపించింది.అతడు మెల్ల మెల్లగా అడుగులు వేస్తూ ఉన్న సమయంలో అతడి పక్క నుండి ఆటో వెళ్లడంతో అంతా అవాక్కవుతారు.

ఆ తర్వాత అతడి పక్క నుండి కార్లు కూడా వెళ్తూ ఉన్నాయి.కెమెరాను కాస్త కిందికి దించగా అసలు విషయం అర్థం అవుతుంది.అది అంతరిక్షం, చందమామ కాదని, అది ఒక గతుకుల రోడ్డు అని తేలిపోయింది.

అతడు చేసిన ప్రయత్నం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అదిరిపోయేలా రెస్పాన్స్‌ దక్కించుకుంది.వీడియోకు కొద్ది రోజుల్లోనే కొన్ని కోట్ల వ్యూస్‌ వచ్చాయి.

అద్బుతమైన స్పందన చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు.ప్రస్తుతం వీడియో చేసిన వ్యక్తి ఎవరా అంటూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

అలాంటి ఐడియా రావడం నిజంగా అద్బుతం అని చెప్పాలి.వీడియో వైరల్‌ అవ్వడంతో కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా మన దేశం గురించి మనం పరువు తీసుకోవడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి కొందరు మాత్రం ఇలాంటి వీడియోలు తీయడం వల్ల ప్రభుత్వం పరువు తీస్తున్నారు.

ఇది ప్రతిపక్షం వారు చేయించారు అంటున్నారు.ఎవరేం అన్నా కూడా బెంగళూరులో ఉన్న రోడ్ల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.

కనుక ఖచ్చితంగా ఇది ప్రజలకు మంచి చేసిందని అంటున్నారు.ఇప్పటికప్పుడే కాకున్నా కొన్ని రోజుల్లోనే బెంగళూరుకు చెందిన ఆ రోడ్లను బాగు చేస్తారని స్థానికులు అంటున్నారు.

ఆ వీడియో చేసిన వ్యక్తి గురించిన పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.అతడి క్రియేటివిటీ మరియు కెమెరా యాంగిల్‌ పెట్టిన విధానంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొత్తానికి ఆ వీడియో సోషల్‌ మీడియా జనాలకు నవ్వు తెప్పించడంతో పాటు, ఆలోపింపజేస్తోంది..