ఏపీలో మళ్లీ ఆరోగ్య శ్రీ సేవలు షురూ..!

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు( Arogya Sri Services ) మళ్లీ ప్రారంభం అయ్యాయి.

పెండింగ్ బకాయిలు చెల్లించలేదని మూడు రోజులపాటు ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్ర సీఎస్ తో నెట్ వర్క్ ఆస్పత్రుల( Network Hospitals ) యాజమాన్యాలు చర్చలు జరిపాయి.ఈ నేపథ్యంలో సీఎస్ హామీతో నెట్ వర్క్ ఆస్పత్రులు ఆందోళనలను విరమించాయి.

దీంతో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ పున: ప్రారంభం అయ్యాయి.అయితే రూ.300 కోట్లు విడుదల చేస్తామని నెట్ వర్క్ ఆస్పత్రులకు సీఎస్ జవహార్( CS Jawahar ) హామీ ఇచ్చారు.కాగా సీఎస్ హామీ మేరకు వచ్చే వారంలో ప్రభుత్వం నిధులను విడుదల చేయనుంది.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు