Aishwarya Sarja: ఆ డైరెక్టర్ తో కూతురి పెళ్లి ఫిక్స్ చేసిన అర్జున్.. వైరల్ న్యూస్?

ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్స్ ఎవరితో ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు కానీ.

ఆ ప్రేమను కొంతకాలం రహస్యంగా ఉంచి ఆ తర్వాత తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఓకే అన్న తర్వాతే మెల్లిమెల్లిగా లీక్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు ఒక స్టార్ హీరో కూతురు విషయంలో కూడా అదే జరుగుతుంది.తను ఒక డైరెక్టర్ ను ప్రేమించగా ఇంతకాలం ఆ విషయాన్ని రహస్యంగా ఉంచగా ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ఆ హీరో ఎవరు ఆయన కూతురు ఎవరో తెలుసుకుందాం.తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన యాక్షన్ కింగ్ అర్జున్( Action King Arjun ) గురించి అందరికీ తెలిసిందే.

తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగి అభిమానులను సంపాదించుకున్నాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయపాత్రలలో నటిస్తున్నాడు.

Advertisement

అంతేకాకుండా కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించాడు.ఈయన తొలిసారిగా 1985 మా పల్లె గోపాలుడు( ma palla gopaludu ) సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఈ సినిమాలో తన నటనతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా వెనుదిరిగి చూడకుండా ఎన్నో అవకాశాలతో దూసుకెళ్ళాడు.ఇక ఈయన శ్రీ మంజునాథ, పుట్టింటికి రా చెల్లి, శ్రీ ఆంజనేయం, ఒకే ఒక్కడు వంటి పలు సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్నాడు.

ఇక ఈయన మరో సినీ నటి నివేదితను( actressniveditha ) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఐశ్వర్య సర్జా, అంజనా సర్జా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.అర్జున్ భార్య నివేదిత ఒకప్పటి సినిమాలో హీరోయిన్.

ఈ విషయం చాలా వరకు ఎవరికీ తెలియదు.వీరిద్దరు కలిసి పలు సినిమాలలో కూడా నటించారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

అలా సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ ఏర్పడింది.ఇక పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ఇక వీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వగా అందులో ఐశ్వర్య సర్జా( Aishwarya Sarja ) ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగుతుంది.ఇప్పటికే పలు సినిమాలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పైగా చూడ్డానికి మంచి అందగత్తే కూడా.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోస్ బాగా పంచుకుంటూ ఉంటుంది.అంతేకాకుండా తన ఫ్యామిలీ ఫొటోస్ కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే గత కొన్ని రోజుల నుండి ఈమె కోలీవుడ్ డైరెక్టర్.ఉమాపతితో ప్రేమలో ఉందని వార్తలైతే వినిపిస్తున్న సంగతి తెలిసిందే.కానీ ఈ విషయం గురించి వీళ్ళు ఎప్పుడు బయట పెట్టలేదు.

అయితే తాజాగా వీరి ప్రేమ గురించి తమ ఫ్యామిలీ చెప్పి ఒప్పించారని.దీంతో త్వరలోనే వీరు ఒకటి కానున్నారని తెలుస్తుంది.

అర్జున్ కూడా తన కూతురు ప్రేమను యాక్సెప్ట్ చేసి ఉమాపతి పేరెంట్స్ తో మాట్లాడారని.త్వరలో మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి కూడా చేయటానికి సిద్ధమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇందులో ఎంత నిజం ఉందో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు