Arjun Viswak Sen : విశ్వక్ విషయంలో తగ్గనంటున్న అర్జున్..!

సీనియర్ హీరో అర్జున్ సర్జా.యువ హీరో విశ్వక్ సేన్ ల మధ్య వివాదం అందరికి తెలిసిందే.

అర్జున్ డైరక్షన్ లో సినిమా ఒప్పుకున్న విశ్వక్ సినిమా షూటింగ్ పెట్టుకుంటే మొదటి షెడ్యూల్ రాకుండా క్యాన్సిల్ చేశాడని మధ్యలో ఫోన్ లు కూడా ఎత్తలేదని.లేటెస్ట్ గా ఒక షెడ్యూల్ చేస్తే నైట్ వరకు బాగానే ఉన్నా షూటింగ్ రోజు రావడం కుదరదని చెప్పరని అన్నారు.

Arjun Doesnot Want Step Back About Viswak Sen Issue , Viswak Sen, Arjun , Arjun

విశ్వక్ చేసింది చాలా పెద్ద తప్పు ఇది ముమ్మటికీ అన్ ప్రొఫెషనల్ అని అన్నారు.దానిపై విశ్వక్ కూడా తాను సినిమా షూటింగ్ కు బయల్దేరే టైం లో కొద్దిగా టెన్షన్ ఉందని ఇలా ఎందుకని మరోసారి మాట్లాడుదాం అనుకుంటే ఆయన ఇక మాట్లాడేది లేదని చెప్పారని అన్నారు.

ఈ విషయంలో నిర్మాతల మండలి జోక్యం చేసుకుని అర్జున్, విశ్వక్ లు మళ్లీ కలిసి పనిచేసేలా చూస్తున్నారట.అయితే అర్జున్ మాత్రం అందుకు ససేమీరా ఒప్పుకోవట్లేదట.

Advertisement

100 కోట్లు ఇచ్చినా విశ్వక్ తో పని చేయనని చెప్పారు.నిర్మాతల మండలి నచ్చ చెప్పినా అర్జున్ మాట వినలేదని.

విశ్వక్ దగ్గర నుంచి రావాల్సిన అడ్వాన్స్ ని ఇప్పించమని అడిగారట.మొత్తానికి విశ్వక్ విషయంలో అర్జున్ వెనక్కి తగ్గట్లేదని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు