బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో రోజులు గడిచే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని సెలబ్రిటీలు షోలో ఉండటంతో ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారో అంచనా వేయడం కష్టంగా మారింది.

ఎలిమినేషన్ ప్రక్రియ సైతం అంచనాలకు భిన్నంగా సాగుతోంది.నిన్నటి ఎపిసోడ్ లో మెహ‌బూబ్‌, అభిజిత్‌, హారిక, అరియానా, మోనాల్, సోహైల్ నామినేషన్స్ లో నిలిచారు.

నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్ మినహా అందరూ అరియానాను టార్గెట్ చేసి ఆమెనే నామినేట్ చేయడం గమనార్హం.అనధికారికంగా జరుగుతున్న సర్వేలను పరిశీలిస్తే ఈ వారం హౌస్ నుంచి అరియానా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

నిన్న నామినేట్ అయిన వాళ్లలో హారిక, అభిజిత్, మోనాల్ స్ట్రాంగ్ గా ఉన్నారు. మెహబూబ్ వీక్ కంటెస్టెంట్ అయినప్పటికీ నిన్నటి ఎపిసోడ్ లో అరియానా హౌస్ లో ఏడవటం ఆమెకు మైనస్ గా మారింది.

Advertisement
Ariyana Glory Will Eliminate From Bigg Boss House This Weekend-బిగ్ బ�

అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావడంతో అరియానా తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని అనిపించడం లేదని.హౌస్ లో ఉన్నవాళ్లు తనకు నచ్చడం లేదని.

తనను ఇంటికి పంపించేయండి అంటూ బిగ్ బాస్ ను వేడుకుంది.దీంతో ఫ్యాన్స్ సపోర్ట్ బాగానే ఉన్నప్పటికీ అరియానానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరో కంటెస్టెంట్ మెహబూబ్ టాస్కుల్లో 100 శాతం ఇస్తూ ఉండటం అతనికి ప్లస్ అవుతోంది.

Ariyana Glory Will Eliminate From Bigg Boss House This Weekend

బిగ్ బాస్ షో పూర్తి కావడానికి మరో ఐదు వారాలే ఉండటంతో షో నిర్వాహకులు సైతం వీక్ డేస్ లో, వీకెండ్స్ లో టీఆర్పీ రేటింగ్ పెరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ప్రేక్షకుల్లో ఓటింగ్ ప్రక్రియ విషయంలో అనుమానాలు తలెత్తుతుండటంతో షో నిర్వాహకులు ప్రతి వారం హోస్ట్ నాగార్జునతో ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతున్నట్టు చెప్పిస్తున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు