ఏపీ ప్రభుత్వ సిట్‎పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

అమరావతి భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వ నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం చేసిన సిట్ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

అమరావతిలో భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వం యొక్క విధాన పరమైన, ఆర్థిక పరమైన నిర్ణయాలతో పాటు ఇతర అంశాలపై విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ గతంలో సిట్ ను ఏర్పాటు చేసింది.అయితే ఈ నిర్ణయాన్ని వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు సవాల్ చేయడంతో సెప్టెంబర్ 15న హైకోర్టు స్టే విధించింది.

దీంతో హైకోర్టు స్టే ను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది.నిన్న ఏపీ ప్రభుత్వం వాదనలు ముగియగా.

ఇవాళ ప్రతివాదుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players