అయోమయంలో ఆరేపల్లి మోహన్.. గుర్తించని బీఆర్ఎస్.. రమ్మంటున్న కాంగ్రెస్.. దారేటు..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ( BRS ) పార్టీ ఇప్పటికే 115 మంది ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ఖరారు చేస్తూ మొదటి జాబితా విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ జాబితాలో ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇచ్చింది.

ఈ జాబితా వెలువడినప్పటి నుంచి బిఆర్ఎస్ లో అసమ్మతి సెగలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.టికెట్ కోసం ఆశపడి భంగపడ్డటువంటి కొంతమంది వ్యక్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం మానకొండూర్( Manakondur ).ఇప్పటికే ఈ నియోజకవర్గానికి రసమయి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.అయితే ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి కీలక నేత ఆరెపల్లి మోహన్ కొంతకాలం క్రితం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

అయితే ఆయన చేరిన సమయంలో మానకొండూరు టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.తీరా టికెట్ల కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ( Rasamayi Balakishan )కు టికెట్ కేటాయించారు కేసీఆర్.

Advertisement

దీంతో ఆరెపల్లి మోహన్ నోట్లో మట్టి కొట్టినట్టు అయింది.

టికెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆరెపల్లి మోహన్ ( Arepalli Mohan ) టికెట్ రాక ఎంతో బాధపడుతున్నారట.ఈ తరుణంలో బిఆర్ఎస్ అధిష్టానం కనీసం అతన్ని పిలిచి భవిష్యత్తులో ఏదైనా పదవి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం లేదట.ఆయనను పూర్తిగా విస్మరించడంతో చాలా బాధపడుతున్నారట.

ఎందుకంటే ఆయనకు వయోభారం వల్ల భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం మరోసారి రాకపోవచ్చు.వచ్చినా ఆరోగ్యం సహకరించకపోవచ్చు.

తన లాస్ట్ ఎన్నిక అని భావించి ఈసారి బీఆర్ఎస్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు.దీంతో బి ఆర్ ఎస్ మొండి చేయి చూపించడంతో, తన సొంత గూడు కాంగ్రెస్ ( Congress ) కు వచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

యూకే ఎన్నికల్లో సిక్కు సంతతి ఎంపీల ప్రభంజనం.. అకల్ తఖ్త్ , ఎస్‌జీపీసీ ప్రశంసలు
సినిమా ఫ్లాప్ అయినా వాణిశ్రీ కట్టిన ఆర్గాండి వాయిల్ చీరలు ఫుల్ ఫేమస్

ఒకవేళ ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరితే టికెట్ వస్తుందా లేదా అనే దానిపై కూడా క్లారిటీ లేదు.ఇప్పటికే మానకొండూరు నియోజకవర్గం లో కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా తయారు చేశారు.

Advertisement

ఈసారి రసమయి బాలకిషన్ కు టికెట్ వచ్చింది కాబట్టి కవంపల్లి సత్యనారాయణ ( Kavvampalli Sathyanarayana ) కాంగ్రెస్ నుంచి గట్టిగానే పోటీ ఇస్తారని తెలుస్తోంది.ఇదే తరుణంలో ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ లో చేరితే కవంపల్లి ని కాదని ఆరెపల్లికి టికెట్ ఇస్తారా.లేదంటే ఆయనకు భవిష్యత్తులో ఏదైనా పదవి ఇస్తామని పక్కన పెడతారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

తాజా వార్తలు