మీరు పారాసెటమాల్‌ను ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ విషయంలో జాగ్రత్త!

ఇక్కడ పారాసెటమాల్‌ టాబ్లెట్ అంటే తెలియని మనుషుల బహుశా ఉండరేమో.అంతలాగ ఈ డ్రగ్ జనాల్లోకి దూసుకుపోయింది.

మనలో ఎవరికన్నా జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, ఇలా రకరకాల సమస్యలు తలెత్తగానే వెంటనే గుర్తొచ్చే టాబ్లెట్ ఒక్కటే.అదే పారాసెటమాల్‌.

అవును, సాధారణంగా జ్వరం, తలనొప్పి వంటివి రాగానే ముందుగా పారాసెలమాల్‌ వాడుతుంటారు.ఈ ఔషధాన్ని ఎప్పుడు ఏ పరిమాణంలో ఉపయోగించాలో చాలా మందికి తెలియదు.

ఎవరి ఇష్టానుసారంగా వారు వాడుతూ వుంటారు.అయితే ఇలా వాడినప్పుడు సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

Advertisement

శరీరంలో ఏదైనా పెద్ద రోగానికి సంకేతం లేని లక్షణాలు కనిపించినట్లయితే, లేదా ఏదైనా చిన్నపాటి నొప్పి ఉన్నట్లయితే వాటి నుంచి రక్షించుకునేందుకు వివిధ రకాల మందులను వాడుతుంటాము.కానీ వాటి వల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పారాసెటమాల్ తరచుగా తీసుకోవడం వల్ల నష్టాలు కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు వైద్యులు.

పారాసెటమాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.తరచుగా జ్వరం వచ్చినప్పుడు పారాసెలమాల్‌ మందులను ఉపయోగిస్తారు.కానీ ఈ ఔషధాన్ని డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువగా తీసుకుంటే అప్పుడు ఎసిడిటీ సమస్య, కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

ఇవి తీవ్రమైతే రక్తం వాంతులు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.పారాసెలమాల్‌ ఎక్కువగా వాడితే అలెర్జీలతో పాటు మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.దీని వల్ల మీకు ఎలర్జీలు, చర్మంపై దద్దుర్లు, రక్త సంబంధిత సమస్యలు వస్తాయి.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

వైద్యులను సంప్రదించకుండా పారాసెలమాల్‌ వేసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందంట.

Advertisement