గొంతులో కఫం పేరుకుపోవడంతో.. ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

సీజన్ మారిన సమయంలో జలుబు, దగ్గు( Cold, cough ) లాంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

దీంతో గొంతులో కఫం( Phlegm ) పేరుకుపోయి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.

అయితే ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం లాంటి వ్యాధులు సర్వసాధారణమని చెప్పుకోవచ్చు.అయితే జలుబు తేలికగా తగ్గకపోతే కొంతమంది యాంటీబయోటిక్ సహాయం తీసుకుంటూ ఉంటారు.

యాంటీ బయోటిక్స్ తో జలుబు నుండి బయటపడేందుకు చాలా సమయం పడుతుంది.ఈ పరిస్థితిలో ఇంటి నుండి ఉపాయాలు తీసుకుంటే చాలా సహాయపడతాయి.

దగ్గు, గొంతు నొప్పి, ఛాతిలో కఫం పేరుకుపోవడం వలన సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి.

Advertisement

ఈ సమస్యలకు చికిత్స చేయడానికి ఇంటి నివారణల సహాయం తీసుకోవచ్చు.అయితే ఇది శ్లేష్మం ఏర్పడడాన్ని కూడా నిరోధిస్తుంది.రోజు ములేటి టీ ( Muleti tea )తాగడం వలన జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

నీటిలో ములేటి, అల్లం వేసి బాగా మరిగించాలి.దీంతో రుచికోసం కొంచెం తేనెను కలుపుకొని తాగితే హాయిగా ఉంటుంది.తేనె, నిమ్మరం నీరు తాగడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి.

ఎందుకంటే తేనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.ఇక నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది.

ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.ఇక పసుపు పాలను తాగడం వలన కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

పసుపు లాంటి ఇన్ఫ్లమెటరీ, యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉంటాయి.ఇవి గొంతు నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.ఇక జలుబు, దగ్గుకు అల్లం కూడా చాలా ప్రభావవంతో పనిచేస్తుంది.

Advertisement

దగ్గు వచ్చినప్పుడు అంత అల్లం ముక్కను నోటిలో పెట్టుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇది గొంతు నొప్పి నుండి చక్కని ఉపశమనం కలిగిస్తుంది.

అలాగే వేడి నీటిలో అల్లం( ginger ) మరిగించి దానిలో తులసి ఆకులు, మిర్యాల పొడి వేసుకోవాలి.ఇక ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు ఉంటాయి.

కాబట్టి ఇవి గొంతు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.అలాగే ఛాతిలో పేరుకుపోయిన కఫాన్ని కూడా క్లియర్ చేస్తాయి.

తాజా వార్తలు