బ్రేక్ ఫాస్ట్ గా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..?

రాత్రి భోజనానికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ ( Breakfast )కు మధ్య చాలా సమయం ఉంటుంది.

అందుకే ఉదయం అల్పాహారన్ని మిస్ చేయొద్దని ఆరోగ్య నిపుణులు( Health professionals ) ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

ప్రతిరోజు ఉదయం సమయంలో మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోమని నిపుణులు చెబుతూ ఉంటారు.అలాగే కొంతమంది నిద్ర లేవగానే ఏది పడితే అది తినడం, తాగడం లాంటివి చేస్తూ ఉంటారు.

దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు( Health problems ) ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాగే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.వాటిని తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.

Advertisement
Are You Taking More Of These For Breakfast But Are You In Danger , Breakfast, He

మరి ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Are You Taking More Of These For Breakfast But Are You In Danger , Breakfast, He

ముఖ్యంగా చెప్పాలంటే సిట్రస్ పండ్లు( Citrus fruits ) తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.కానీ ఉదయాన్నే ఈ పండ్లు కానీ, జ్యూస్ కానీ తాగితే అల్సర్స్, గుండెల్లో మంటలు, గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఉదయం సమయంలో స్పైసీ గా ఉన్న ఆహారాన్ని తినేందుకు ఎంతో మంది ఇష్టపడతారు.

ఇలా అస్సలు తినకూడదు.దీని వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

అంతేకాకుండా స్పైసీ ఫుడ్( Spicy food ) లో పోషకాలు తక్కువగా ఉంటాయి.వాటి వల్ల ఇంకా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Are You Taking More Of These For Breakfast But Are You In Danger , Breakfast, He
Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

ముఖ్యంగా చెప్పాలంటే బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ అండ్ జామ్( Bread, jam ) ను కొంతమంది తీసుకుంటూ ఉంటారు.ఎందుకంటే ఇది చాలా వేగంగా తయారయ్యే బ్రేక్ ఫాస్ట్ అని అందరూ దీన్నే ఎంచుకుంటూ ఉంటారు.దీన్ని తినడానికి చాలామంది ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు.

Advertisement

కానీ ఉదయం సమయంలో బ్రెడ్ జామ్ ని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఉదయం సమయంలో కొంత మంది ప్యాకేజ్డ్ జ్యూస్ లు తాగుతూ ఉంటారు.

ఇలా అసలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజా వార్తలు