కంటి దురదతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ చిట్కాను ఉపయోగించండి..!

పెరుగుతున్న కాలుష్యం వలన చర్మం పైనే కాకుండా కళ్ళ పైన కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ధూళి పొగలాంటి కాలుష్యకారకాలు కళ్ళలోకి చేరి మంట దురద లాంటి సమస్యలకు దారి తీస్తుంది.

ఎవరికైనా అలర్జీ ఉంటే ఈ కాలుష్యం వలన కళ్ళలో దురద సమస్య మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే కళ్ళలో దురద వచ్చినప్పుడు చాలా మంది వాటిని చేతులతో గట్టిగా రుద్దుతూ ఉంటారు.

కానీ ఇలా చేయడం కళ్ళకు చాలా హానికరం.దీని వలన కళ్ళలో మరింత చికాకు నొప్పి పెరగడమే కాకుండా దృష్టి సమస్యలు కూడా రావచ్చు.

అయితే కళ్ళలో దురద( Itchy Eyes )ను తగ్గించడానికి కొన్ని సులభమైన ఇంటి నివారణలు కూడా ఉన్నాయి.ఈ చిట్కాలు చాలా వరకు దురద సమస్యను పరిష్కరిస్తాయి.కళ్ళు శుభ్రం చేసుకోవడం వలన కళ్ళలోని దుమ్ము, ధూళి తొలగిపోయి దురద తగ్గుతుంది.

Advertisement

ఒక శుభ్రమైన గుడ్డను చల్లటి నీటిలో నానబెట్టి దానితో కళ్ళు తుడవాలి.అలాగే కళ్ళకు చల్లదనాన్ని కోసం గులాబీ నీళ్లను కూడా ఉపయోగించవచ్చు.

ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కళ్ళకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవి కళ్ళకు చల్లదనాన్ని ఇస్తాయి.అలాగే దురద ను తగ్గిస్తాయి.ఒక పాన్ ను గులాబీ నీటిలో నానబెట్టి కళ్ళపై ఉంచాలి.

ఆ తర్వాత పది నుండి 15 నిమిషాల తర్వాత తీసేయాలి.అలాగే ఆవిరి పట్టడం కళ్ళలోని మంటను తగ్గించడానికి దురదను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి ముఖాన్ని గిన్నె పై ఉంచి ఆవిరిని పీల్చుకోవాలి.ఐదు నుండి పది నిమిషాలు ఇలా చేయాలి.

Advertisement

అల్లం రసం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది.ఇది కళ్లకు చల్లదనాన్ని కూడా అందిస్తుంది.

అలాగే దురదలను కూడా తగ్గిస్తుంది.అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం రసాన్ని( Ginger Juice ) ఒక గ్లాసు నీటిలో కలిపి తాగడం చాలా మంచిది.

తాజా వార్తలు