బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా సుడిగాలి సుదీర్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుదీర్ ప్రస్తుతం మల్లెమాలవారు నిర్మాణంలో వస్తున్నటువంటి కార్యక్రమాలకు దూరమయ్యారు.ఈ క్రమంలోనే ఈయన ఈటీవీ వదిలి పూర్తిగా స్టార్ మాకు పరిమితమయ్యారు.
ఈ క్రమంలోనే ఈటీవీ 27వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా ఈటీవీ వారు భలే మంచి రోజు అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి తిరిగి సుధీర్ అనసూయ ఇద్దరు కూడా హాజరైనట్టు తెలుస్తుంది.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ రావడంతో పెద్ద ఎత్తున హైపర్ ఆది తనపై సెటైర్లు వేస్తూ తన పరువు తీసారు.ఒక స్కిట్లో భాగంగా సర్ మనకి బ్రేక్ ఎప్పుడు అంటూ సుధీర్ అనగా మేము నీకు ఎప్పుడు బ్రేక్ ఇచ్చేసాము.అయినా నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు అంటూ సుధీర్ పై ఆది తనదైన శైలిలో పంచ్ వేశాడు.
అలాగే మరో స్కిట్లో నేను మారిపోయాను అంటూ సుధీర్ రాజా సినిమాలో వెంకీ స్టైల్ లో డైలాగ్ చెప్పగా వెంటనే ఆది ఎక్కడికి ఈ టీవీ నుంచి స్టార్ మాకు మారి పోయావా అంటూ మరోసారి తనపై కౌంటర్ వేశారు.మొత్తానికి సుధీర్ ఈ కార్యక్రమానికి తిరిగి రావడంతో ఆది తనదైన శైలిలో తనపై సెటైర్లు వేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy