వ‌న‌మా అన‌వ‌స‌రంగా అన్నీ గుర్తు చేస్తున్నారా..? కోరి గెలుక్కోవ‌ట‌మంటే ఇదేనేమో..!

రాజ‌కీయ నాయ‌కులు సాధార‌ణంగా గ‌తంలో ఏదైనా ఇష్యూ జరిగితే దాని ప్ర‌భావం ఎక్కువ రోజులు ఉండ‌కుండా సైడ్ చేస్తుంటారు.మ‌ళ్లీ దాన్ని గెల‌క్కుండా జాగ్ర‌త్త ప‌డ‌తారు.

ప్ర‌త్యర్థుల నుంచి కూడా ఆ మాట‌లు వినిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.అంతే కానీ వాళ్లు తిరిగి దాన్ని తొవ్వుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌రు.

కానీ ప్ర‌స్తుతం కొత్త‌గూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌రావు పాత పంచాయితీని తిర‌గేశారు.ఆ ఇష్యూని గుర్తుచేసుకుని మ‌రింత డ్యామేజ్ చేసుకుంటున్నారు.

తనకొడుకు వనమా రాఘవేంద్రపై ప్రత్యర్థులు కుట్రలు చేసి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారంటూ మండిపడుతున్నారు.వనమా రాఘవేంద్ర‌రావు పేరు ఒక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.

Advertisement
Are You Reminding Everything Unnecessarily This Is What It Means To Win..!, Van

ఓ ఆస్తి తగాదాలో తల్లి కూతురు, కొడుకు మధ్య గొడవలు వ‌చ్చాయి.తల్లీ కూతుర్లు ఒకవైపు కొడుకు మరోవైపుగా గొడవలు పడ్డారు.

తన తల్లి చెల్లిని పిలిచి బుద్ధి చెప్పమని ఆ కొడుకు వనమా రాఘవను కోరారు.అయితే వీళ్ల‌ గొడవలు తెలిసి సదరు వ్యక్తి తన దగ్గరకు వచ్చేట్లుగా రాఘవే చెశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పోనీ వచ్చిన తర్వాత పెద్దమనిషిగా అందరినీ కూర్చోబెట్టి పంచాయితీ చేశారా అంటే అదీ లేదు.ఇక్క‌డ ఆ కొడుకుకి అనుకూలంగా మాట్లాడాలంటే ఆ వ్య‌క్థి త‌న భార్యను తన దగ్గరకు పంపాల‌ని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు వినిపించాయి.

ఇక దీంతో ఆ వ్య‌క్తి త‌న భార్య‌ను ఎలా కాపాడుకోవాలో తెలియ‌క.ఆస్తి విష‌యం తేల‌క‌.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

కుటుంబంలోని భార్యభర్తలు.ఇద్దరు పిల్లలు పెట్రోలు పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Are You Reminding Everything Unnecessarily This Is What It Means To Win.., Van
Advertisement

కావాల‌నే ఇరికించార‌ని..దీంతో రెండురాష్ట్రాల్లో ఆ ఘటన సంచలనమైన విష‌యం తెలిసిందే.

అయితే ఆ ఘటన తర్వాత రాఘవ బాధితులు చాలామంది ఆడవాళ్లు పోలీసుల దగ్గరకు క్యూ కట్టారు.ఇంత జరిగాక ఇప్పుడు వ‌న‌మా వెంకటేశ్వరరావు మాత్రం తన కొడుకు అమాయకుడని చెప్పుకుంటున్నారు.

తాను అనారోగ్యంతో రెండు నెలలు హైదరాబాద్ లో హాస్పిట‌ల్ లో ఉన్న సమయంలో కొడుకుపై కుట్రలు చేసి ఇరికించారని ఎంతో అమాయ‌కంగా చెబుతున్నారు.ఇదే న‌మ్మాల‌ని ఎమ్మెల్యే చెబుతున్నార‌నుకుంటా.

ఇక వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీచేస్తానని ప్రకటించారు.ఇంతవరకు బాగానే ఉందికానీ మధ్యలో కొడుకు ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు.? తండ్రిగా తన కొడుకు అమాయ‌కుడు అంటే స‌రిపోతుందా.అయినా ఇప్పుడు ఆ పంచాయితీ గురించి ఎందుకు చెప్పిన‌ట్లో.

అంటున్నారు.

తాజా వార్తలు