' కారు ' పార్టీకి రిపేర్లు గట్టిగానే చేస్తున్నారా ? 

తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ( BRS party ) మళ్లీ అధికారంలోకి వచ్చే దిశగా పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి , పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు .

ఒకవైపు అధికార కాంగ్రెస్ నేతలు పదే పదే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉండడం, గత బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను హైలెట్ చేస్తుండడం, అలాగే బీ ఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు,  ఎమ్మెల్యేలను తమ పార్టీలు చేర్చుకుంటూ బీఆర్ఎస్ ను మరింత బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో అలర్ట్ అయిన కేసీఆర్ ( KCR ) ఆ దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ మేరకు పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అధికారంలో ఉన్న పదేళ్లలో జరిగిన పొరపాట్లపై సమీక్ష చేసుకుంటూనే అప్పట్లో రాష్ట్రం సాధించిన ప్రగతి వంటి వాటిని హైలెట్ చేయాలని భావిస్తున్నారట.

అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న విద్యార్థులు,  నిరుద్యోగులు,  బీఆర్ఎస్ ( Students, Unemployed, BRS )కు అండదండగా నిలవడంతోనే రెండుసార్లు అధికారంలోకి వచ్చామని,  కానీ ఆ తర్వాత వారిని సరిగా పట్టించుకోకపోవడంతో ఆ ప్రభావం మొన్నటి ఎన్నికల్లో కనిపించిందని బీ ఆర్ ఎస్ అధిష్టానం గుర్తించింది.తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడానికి తమ తప్పిదాలు కూడా చాలానే ఉన్నాయని,  చాలా వర్గాల ప్రజలలో పెరిగిన అసంతృప్తి బీఆర్ఎస్ ఓటమికి కారణం అయ్యాయని గుర్తించిన బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగుతోంది.పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

  దీనికోసం పార్టీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసే విధంగా ప్రణాళిక ను రచిస్తున్నారు.ప్రస్తుతం గ్రూప్ 1 అంశం తో పాటు,  విద్యారంగ సమస్యలపై బిఆర్ఎస్ తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

విద్యార్థి సమస్యలను హైలెట్ చేయడంతో పాటు,  వాళ్లకు అన్ని విధాలుగా అండగా నిలబడాలని భావిస్తున్నారట.ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన మిగతా అనుబంధ విభాగాల ప్రక్షాళన చేపట్టే దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.ఇంటర్,  డిగ్రీ , కాలేజీ స్థాయిలోనే కమిటీ నియామకం చేపట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

జూనియర్ కాలేజీ ల నుంచి యూనివర్సిటీ ల వరకు కమిటీలు వేస్తే విద్యార్థులు గ్రామస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా,  తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తారనే  ప్లాన్ లో బీఆర్ఎస్ ఉంది.అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదని,  ఇప్పటి వరకు పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను పోగొట్టి మళ్ళీ యాక్టివ్ చేసేందుకు కాస్త సమయం అవసరమని భావిస్తున్నారు.

ఇప్పటికే పార్టీ విద్యార్థి విభాగంతో తెలంగాణ భవన్ లో సమావేశాన్నీ నిర్వహించారు.

పుష్ప 2 లో జగన్ డైలాగ్... ఫుల్ సపోర్ట్ ఇస్తున్న వైసీపీ ఫ్యాన్స్?
Advertisement

తాజా వార్తలు