నాగ దోషంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ దేవాలయానికి..?

హిందువు ధర్మంలో నాగ దోషాన్ని( Naga Dosha ) చాలామంది ప్రజలు విశ్వసిస్తారు.

ఒక వ్యక్తి జాతకం ప్రకారం నాగ దోషం ఉన్నట్లయితే కచ్చితంగా పరిహారం చేసుకోవాలి.

ఈ దేవాలయానికి వెళ్ళినట్లయితే వీటి పరిహారాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.ఒక వ్యక్తికి నాగదోషం ఉంటే అది చాలా అరిష్టం, ఆర్థిక నష్టానికి, సంతానం నష్టానికి దారితీస్తుందని చెబుతున్నారు.

ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా పరిహారం చెల్లించుకోవాలి.అలాగే చాలా సంవత్సరాల వరకు పెళ్లి కాకపోయినా, పెళ్లి అయినప్పటికీ పిల్లలు పుట్టకపోయినా అది నాగ దోషంగానే భావించాలని పండితులు ( Scholars )చెబుతున్నారు.

Are You Facing Many Problems With Naga Dosha.. But For This Temple , Naga Dosha

నాగ దోషం అనేది పూర్వజనంలో పాములను చంపిన వారికి, ఔషధాలతో సర్పాలని బంధించే వారికి,పుట్టలను తవ్వేవారికి, పుట్టలను తొలగించి ఇల్లు కట్టే వారికి నాగదోషం తగులుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.జాతక చక్రంలో రాహువు లేదా కేతువు 1, 2, 5, 7, 8 స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేక అశుభ స్థానాలలో ఉన్నట్లయితే సర్ప దోషం ఉందని చెప్పవచ్చు.ఇలాంటి వాళ్లు సమయానికి సంతానం లేక ఇబ్బందులు పడుతుంటారు.

Advertisement
Are You Facing Many Problems With Naga Dosha.. But For This Temple , Naga Dosha

అలాగే సమయానికి వివాహాలు కూడా జరగవు.ఇలాంటి వాళ్లు కచ్చితంగా పరిహారం చేయించుకోవాలి.

నాగ దోషంతో ఇబ్బంది పడేవారు కృష్ణా జిల్లాలోని మోపిదేవి దేవాలయాని( Mopidevi temple )కి వెళ్లాలి.

Are You Facing Many Problems With Naga Dosha.. But For This Temple , Naga Dosha

ఈ దేవాలయం మచిలీపట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.దీనిని మోహిని పురం అని కూడా పిలుస్తారు.మోపిదేవి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.

అక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ( Subrahmanyeshwar Swamy )సర్ప రూపంలో వెలిశారని చాలామంది ప్రజలు నమ్ముతారు.నాగ పంచమి రోజు ఈ విశిష్టమైన పుణ్యక్షేత్రానికి మన దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

నాగ దోషం తో బాధపడేవారు, వివాహం జరగక బాధపడేవారు, సంతానం కోసం ప్రయత్నించేవారు, మోపిదేవి దేవాలయంలో ప్రతిజ్ఞ పూజలు చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారని నమ్ముతారు.

Advertisement

తాజా వార్తలు