వారు పార్టీ మారుతున్నారా ? జగన్ కు ఇబ్బందే 

ఏపీ అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన వైసిపి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యింది.కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఉంది .

175 స్థానాలకు గాను ,కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు.అలాగే 25 ఎంపీ స్థానాలకు గాను నాలుగు స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

టిడిపి,  జనసేన , బిజెపి కూటమికి అఖండ మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు .దీంతో వైసిపి( YCP ) ఇప్పట్లో కోలుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు.పార్టీ ఈ స్థాయిలో ఓటమి చెందడానికి జగన్ అనాలోచిత నిర్ణయాలు కారణమని వైసిపి నాయకులు , కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .ఇక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు,  ఎంపీలలో చాలామంది పార్టీ మారే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా విస్తృతంగా సాగుతోంది.

Are They Switching Parties Jagan Is In Trouble , Tdp, Bjp, Janasena, Ysrcp, Ap

ముఖ్యంగా వైసిపి ఎంపీలను చేర్చుకునే విషయంపై బీజేపీ( BJP) ఫోకస్ చేయడం,  మరి కొంతమంది టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు వెలవడుతున్నాయి.వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలలో ఒకరు జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి.కడప పార్లమెంట్ స్థానం నుంచి అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) విజయం సాధించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పార్టీ మారరు.

Advertisement
Are They Switching Parties Jagan Is In Trouble , TDP, BJP, Janasena, Ysrcp, Ap

అలాగే రాజంపేట నుంచి మిథున్ రెడ్డి విజయం సాధించారు.  ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడు .ఆయన పార్టీ మారే అవకాశం లేదు.  ఇక మరో నమ్మకమైన వ్యక్తి తిరుపతి ఎంపీ గురుమూర్తి.

ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారరు .మిగిలింది అరకు ఎంపీ చెట్టి తనూజారాణి( Thanuja Rani ) గెలిచిన నలుగురు ఎంపీలలో అరకు ఎంపీ పై మాత్రమే కాస్త అనుమానాలు ఉన్నాయి.ఇక రాజ్యసభ ఎంపీల విషయంలో అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి.

Are They Switching Parties Jagan Is In Trouble , Tdp, Bjp, Janasena, Ysrcp, Ap

 వైసీపీ రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి,  గొల్ల బాబురావు , మేడ రఘునాథరెడ్డి,  విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య ,ఎస్ నిరంజన్ రెడ్డి,  బీద మస్తాన్ రావు,  ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి , మోపిదేవి వెంకటరమణ , పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని ఉన్నారు.వీరిలో నలుగురు పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా పరిమల్ నత్వాని తో పాటు,  మరో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

రాజ్యసభలో వైసిపికి 11 మంది ఎంపీలు ఉన్నారు.టిడిపికి ఒక రాజ్యసభ సభ్యుడు కూడా లేరు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఉభయ సభలు కలుపుకుంటే వైసీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారు.టిడిపికి 16 మంది ఎంపీలు ఉన్నారు.

Advertisement

దీంతో వైసిపికి రాజ్యసభలో బలం తగ్గించడమే లక్ష్యంగా బిజెపి ,టిడిపి లు వ్యూహాలు రచిస్తున్నాయి.

తాజా వార్తలు