పుట్టిన తేదీలో నెంబర్ 1 ఉంటే వారు అదృష్టవంతులేనా..

న్యూమరాలజీ ప్రకారం కొన్ని నెలలలో ఉండే తేదీలలో పుట్టిన వారు వారి పై కచ్చితంగా ఆ తేదీల ప్రభావం ఉంటుంది.

ఇలాంటి సంఖ్యల ఆధారంగా వ్యక్తుల జీవితాన్ని సంఖ్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తారు.

అయితే న్యూమరాలజీ లో నెంబర్ వన్ అనేది చాలా ప్రత్యేకం అయినది.నెంబర్ వన్ అనేది సూర్య భగవంతునికి చెందిన సంఖ్య.

ఇది కెరియర్లో విజయవంతమైన బలమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తుంది.అయితే జీవితంలో 28, 32, 35 లేదా 40 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత వీరికి అదృష్టంతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది.

పుట్టిన తేదీలో నెంబర్ వన్ ప్రధానంగా ఉన్నవారికి ఎప్పుడూ ఊహించని విధంగా డబ్బు వస్తూ ఉంటుంది.వారి జీవితంలో ధన లాభం అనేది ఎప్పుడూ ఉంటుంది.

Advertisement
Are They Lucky If They Have Number 1 In Their Date Of Birth Details, -పుట�

ఇలాంటివారు ప్రేమ విషయంలో ఒకరిపై ఒకరు ఎక్కువ ప్రేమను చూపించుకుంటూ ఉండటం వల్ల వీరి జీవితంలో ప్రేమ అనురాగం బలంగా ఉంటుంది.పుట్టిన తేదీలో నెంబర్ వన్ ఉన్నవారికి కొన్ని అదృష్ట సంకేతాలు ఉంటాయి.

అవి ఏంటంటే ఇలాంటి వారికి లక్కీ రోజు ఆదివారం. నెంబర్ వన్ కి అధిపతి సూర్యుడు ఇంకా చెప్పాలంటే వీరికి కలిసివచ్చే రంగులు ఆకుపచ్చ, నారింజ.

వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి, మూడు.ఇంకా చెప్పాలంటే మంచి తెలివితేటలతో స్వతంత్రంగా ఉండేందుకు వీరు ఇష్టపడతారు.

వీరికి పని మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది.

Are They Lucky If They Have Number 1 In Their Date Of Birth Details,
ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

ఇలాంటివారు జాగ్రత్తగా కొన్ని విషయాలలో ఉండాలి.అంతేకాకుండా దూకుడును కూడా తగ్గించుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది.అహాన్ని పక్కన పెడితే అంతా శుభం కలిగే అవకాశం ఉంది.

Advertisement

ఇలాంటి వారికి అనుకూలమైన పనులు ఏమిటంటే ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, ఆభరణాలు, నటన, స్టాక్‌లు, ఈవెంట్‌లు, ప్రకటనలు, నిర్మాణ వస్తువులు వంటి రంగాలు వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.ఇలాంటివారు సూర్యభగవంతునికి నీటిని సమర్పించడం మంచిది.

గుడికి పసుపు రంగు ఆవాలు దానం చేయడం కూడా మంచిదే.ఇలాంటివారు నాన్ వెజ్, లిక్కర్, పొగాకు దూరంగా ఉండడం మంచిది.

తాజా వార్తలు