పల్లీలు బెల్లం కలిపి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం అనేక ఆరోగ్య నియమాలను పాటిస్తూ ఉండాలి.

ఆ ఆరోగ్య నియమాలలో త్వరగా ఉదయం నిద్ర లేవడం, వేళకు భోజనం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, తగినంత నీరు త్రాగడం రాత్రి త్వరగా నిద్రించడం, ఇలాంటివి ఆరోగ్యకరమైన అలవాటులను క్రమం తప్పకుండా చేస్తూనే ఉండాలి.

అప్పుడే మన ఆరోగ్యం సరిగా ఉండే అవకాశం ఉంది.అయితే పోషకాలు కలిగిన ఆహారాల్లో పల్లీలు, బెల్లం కూడా ఉన్నాయి.

సాధారణంగా వీటిని మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాము.అంతేకాకుండా బెల్లం తో స్వీట్లు తయారు చేస్తూ ఉంటాము.

కానీ రోజు వీటిని నేరుగా చాలా తక్కువ మంది తింటూ ఉంటారు.రోజు ఒక గుప్పెడు పల్లెలను తిని తర్వాత చిన్న బెల్లం ముక్క ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

ఈ మిశ్రమాన్ని మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత తినడం ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది.రోజు పల్లీలు, బెల్లం కలుపి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పల్లీలు బెల్లం కలిపి రోజు తినడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది.దీని వల్ల రక్తహీనత సమస్య కూడా దూరమవుతుంది.

మహిళలలో రక్తహీనతతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు.అలాంటివారు పల్లీలు, బెల్లం తింటే ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే రక్తంలో ఉండే వ్యర్ధాలు, విష పదార్థాలు బయటకు వెళ్తాయి.దీనివల్ల ఇన్ఫెక్షన్లు రక్త సంబంధిత వ్యాధులు మన దగ్గరికి రావు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఇంకా చెప్పాలంటే అధిక రక్తపోటు సమస్య అలాగే గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.

Advertisement

వీటిని రెండిటిని తినడం వల్ల ఆ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఎదిగే పిల్లలకు ఈ మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల వారు రోజంతా ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు.అంతేకాకుండా చదువుల్లో, క్రీడాల్లో బాగా రాణిస్తారు.

ఇంకా చెప్పాలంటే పిల్లలో జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది.

తాజా వార్తలు