చంద్రబాబు హామీలపై ఇన్ని అనుమానాలు ఉన్నాయా ?

త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది .రెండోసారి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో వైసిపి ఉంది.

  వై నాట్ 175 అనే స్లోగన్ వినిపిస్తూ,  175 నియోజకవర్గాల్లోనూ( 175 constituencies ) గెలిచేందుకు స్కెచ్ వేస్తోంది.  గత ఐదేళ్లలో తమ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు , ఎన్నికల హామీలను నెరవేర్చడం వంటివి జనాల్లో తమపై మరింత నమ్మకాన్ని పెంచాయని,  మళ్లీ మరోసారి తమకే పట్టం కడతారనే ధీమా తో వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఉన్నారు.

ఇక జనాలు అంతా సంక్షేమ పథకాలకు బాగా అలవాటు పడడంతో,  ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు వైసిపి ని మించిన స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని టిడిపి ,జనసేన బిజెపి కూటమి ప్రకటించింది.సూపర్ సిక్స్ పేరుతో  కొత్త మేనిఫెస్టోను ప్రకటించి జనాల్లోకి వెళ్తున్నారు.

ఈనెల 13న ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.  ఈ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదన్న ధీమా లో అన్ని పార్టీలు ఉన్నాయి.

Are There So Many Doubts About Chandrababus Promises, Tdp, Janasena, Bjp, Ap, A
Advertisement
Are There So Many Doubts About Chandrababu's Promises, TDP, Janasena, BJP, Ap, A

గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత చాలావరకు జగన్ అమలు చేశారు.అయితే జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలపై టిడిపి, జనసేన,  బిజెపిలు ( TDP, Jana Sena, BJP )అనేక విమర్శలు చేశాయి.అయితే ఇప్పుడు అంతకంటే మించిన స్థాయిలో టిడిపి , జనసేన ఎన్నికల మేనిఫెస్టో ఉండడం తో , రేపు కూటమి అధికారంలోకి వస్తే ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయగలరా అనే సందేహాలు జనాల్లో కలుగుతున్నాయి .ఎందుకంటే టిడిపి కూటమి ప్రకటించిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటే దాదాపు 5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుంది.అయితే ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో అంత ఆర్థిక భారం మోసే పరిస్థితి ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Are There So Many Doubts About Chandrababus Promises, Tdp, Janasena, Bjp, Ap, A

కచ్చితంగా  సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిస్తారని, రకరకాల నిబంధనలు పెట్టి భారీగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయాలు జనాల్లో కలుగుతున్నాయి .2014 ఎన్నికల్లో టిడిపి గెలిచిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చాలా వరకు జరగకపోవడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో చంద్రబాబు ఎప్పుడు ముందు ఉంటారు ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుత ఎన్నికల హామీలపై జనాల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు