Turtle statue : ఇంట్లో తాబేలు విగ్రహాన్ని సరైన దిశలో ఉంచుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.

అలాగే తమ ఇల్లను కూడా వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని చాలామంది ప్రజలు భావిస్తూ ఉంటారు.

ఇంట్లో కొన్ని వస్తువులను సరైన దిశలో ఉంచితే ఆ ఇంటికి శుభం జరుగుతుందని చాలామంది చెబుతున్నారు.ఇంట్లో తాబేలు విగ్రహాన్ని కానీ ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు.

తాబేలును ఎప్పుడూ పడగదిలో ఉంచుకోకూడదు.దీనివల్ల ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఇంట్లో తాబేలు ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషాలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు.అలాంటి వారికి వ్యాపారంలో అభివృద్ధి, ఇంట్లో ఆనందం ఇంకా, ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు.

Advertisement

ఇంట్లో తాబేలు తెచ్చే వారు చాలామంది మన దేశంలో ఉన్నారు.కానీ తాబేలు ఇంట్లో ఖచ్చితమైన దిశలో ఉంచుకోవడం కూడా తెలిసి ఉండాలి.

ఇంట్లో తాబేలు విగ్రహాన్ని సరైన దిశలో పెట్టడం వల్ల ఇంట్లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.అదే సమయంలో ఇంట్లో డబ్బు సమస్య కూడా దూరమవుతుంది.

ఇంట్లోనే కాకుండా ఆఫీసులో కూడా తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవచ్చు.ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.

ఇంట్లో, ఆఫీసుల్లో తాబేలు ఉంచుకోవడం వల్ల ఆ వ్యక్తి ప్రతి విషయంలోను విజయం సాధిస్తాడు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ఇంట్లో లోనీ పూజ గదులలో లోహంతో చేసిన తాబేలును ఉంచవచ్చు.తాబేలును ఎప్పుడూ నీరు లేకుండా ఉంచకూడదనే ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి.తాబేలును నీటిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.

Advertisement

ఇలా చేయడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు, విజయం లభిస్తుంది.తాబేలను ఉత్తరాన ఉంచడం ఆ ఇంటికి శుభం కలుగుతుంది.

ఎందుకంటే ఉత్తర దిశ లక్ష్మీదేవి స్థానంగా ప్రజలు భావిస్తారు.అలాగే శత్రువుల నుండి కలిగే నష్టాలు కూడా దూరం అవుతాయి.

తాజా వార్తలు