Mohan Babu : మోహన్ బాబుకు, సాయి పల్లవికి మధ్య ఇంత దగ్గర పోలికలు ఉన్నాయా.. ఇంతకు అవేంటంటే?

మామూలుగా చాలామందికి కొన్ని మ్యాచ్ అయ్యే దగ్గర పోలికలు ఉంటాయి.ఒకరికొకరు తెలియకున్న కూడా వాళ్ళ ఆలోచనలు మాత్రం బాగా కలిసిపోతూ ఉంటాయి.

అవి సామాన్యంగా చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి.అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళల్లో కూడా చాలా వరకు దగ్గర పోలికలు ఉండే ఆలోచనలు ఉంటాయి.

వాళ్లు కూడా తమ సినిమాల విషయంలో, వ్యక్తిగత విషయంలో ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు.అయితే ఈ విషయంలో మోహన్ బాబు( Mohan Babu )కు, సాయి పల్లవికి దగ్గర పోలికలు ఉన్నాయని.

వారి ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయని తెలిసింది.అయితే తెలుగు ప్రేక్షకులందరికీ మోహన్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా ఓ రేంజ్ లో బాగా హడావుడి చేశాడు.తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పుడు వయసు మీద పడటంతో సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు.

ఇక సాయి పల్లవి( Sai Pallavi ) గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అని చెప్పాలి.ముఖ్యంగా తన వ్యక్తిగత విషయం పట్ల ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.ఇప్పటివరకు ఏ సినిమాల్లో కూడా తను గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.

పైగా డబ్బుకు ఆశపడే అమ్మాయి కూడా కాదు.మంచి క్యారెక్టర్ అయితే చిన్న సినిమా అని కూడా చేస్తుంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా సాయి పల్లవి, మోహన్ బాబుకు దగ్గర పోలికలు ఉన్నాయని.వారి ఆలోచనలు కూడా ఒకేలాగా ఉంటాయని అభిమానులు అనుకుంటున్నారు.

Advertisement

ఇంతకు ఏ విషయంలో వారి ఆలోచనలు ఒకేలా ఉన్నాయో తెలుసుకుందాం.

వీరిద్దరూ సినిమాల విషయంలో బాగా శ్రద్ధగా ఉంటారట.చెప్పిన సమయానికి లొకేషన్ లో ఉంటారట.అయితే మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులు సినీ ఇండస్ట్రీకి అడుగుపెడుతున్న సమయంలో తన సపోర్ట్ ఉండదని.

సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదగాలని అన్నాడట.సాయి పల్లవి చెల్లెలు కూడా సినీ ఇండస్ట్రీకి అడుగు పెడతాను అని అన్నప్పుడు తను కూడా తన చెల్లెలుతో తన సపోర్టు ఉండదని.

సొంత టాలెంట్ తోనే అడుగు పెట్టాలని అన్నదట.

ఇక సాయి పల్లవికి ఫేస్ క్రీమ్ కు సంబంధించిన యాడ్ చేయమని ఆఫర్ రావడంతో సాయి పల్లవి తను అటువంటివి చేయనని.పైగా ఎంత పారితోషకం ఆశ చూపించిన కూడా వద్దని చేయలేదని తెలిసింది.అయితే మోహన్ బాబు కూడా మంచి కెరీర్ లో ఉన్న సమయంలో తనకు కూడా ఒక బ్రాండ్ కి సంబంధించిన యాడ్ లో చెయ్యమని అవకాశం రావడంతో అస్సలు చేయను అని అన్నాడట.

అలా ఈ మూడు విషయాలలో సాయి పల్లవికి, మోహన్ బాబుకు దగ్గర పోలికలు ఉండటంతో.వీరి ఆలోచనలు కలిసిపోయాయని అనుకుంటున్నారు తమ అభిమానులు.

తాజా వార్తలు