ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా... అయితే శ్రీకాళహస్తి వెళ్లాల్సిందే..!

మన హిందూ సాంప్రదాయాలలో వాస్తు దోషానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము.ముఖ్యంగా ఇంటిని నిర్మించేటప్పుడు తప్పనిసరిగా వాస్తు ప్రకారమే మన ఇంటిని నిర్మించుకుంటాం.

అయితే కొన్ని సార్లు మన ఇంట్లో వాస్తు దోషాలు ఉండటం వల్ల ఆ కుటుంబ సభ్యులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు.కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎలాంటి పనులు ప్రారంభించిన ముందుకు సాగకపోవడం, మానసిక ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

అయితే ఈ వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కోసం కొందరు ఏవేవో చేస్తుంటారు.అయితే మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోవాలంటే శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెళ్లాలని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇంట్లో వాస్తు దోషాలతో ఇబ్బంది పడేవారు శ్రీకాళహస్తికి చేరుకొని స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి.ఈ ఆలయంలో ఉన్న స్వామి వారు ఇతర శివాలయాలలో ఉన్న స్వామి వారి కంటే ఎంతో ప్రత్యేకం.

Advertisement
Are There Any Structural Vaastu Defects In The House Then Visit Sri Kalahasthi,

ఇంట్లో వాస్తు దోషాలు ఉన్న వారు ఈ ఆలయంలో రాహు దోష నివారణ పూజలు చేయించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.అదేవిధంగా శుక్రవారం లక్ష్మీదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Are There Any Structural Vaastu Defects In The House Then Visit Sri Kalahasthi,

ముఖ్యంగా పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజులలో శివ దర్శనం చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.అలాగే ప్రతిరోజు 27 సార్లు వాస్తు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి.అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి ఫాల్గుణ, వైశాఖ, శ్రావణ కార్తీక మాసాలు ఎంతో అనుకూలమైనవి.

ఈ నెలలో గృహ ప్రవేశం చేయడం ద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందుతారని వాస్తు శాస్త్రం నిపుణులు తెలియజేస్తున్నారు.

కోపాన్ని అదుపులోకి తెచ్చే బెస్ట్ టిప్స్ మీకోసం?
Advertisement

తాజా వార్తలు