Tomatoes health tips : టమాటో తింటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

ప్రస్తుతం చాలామంది ప్రజలు వారి ఆరోగ్యాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటున్నారు.ఎందుకంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా ఏమీ ఉపయోగం ఉండదు.

కానీ మన ఆరోగ్యం బాగుంటే మాత్రం మనతో పాటు మన కుటుంబ సభ్యులందరికీ కూడా మంచిదే.దానికోసం ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఆకుపచ్చని కూరగాయలను, పండ్లను, ఇంకా వివిధ రకాల పౌష్టిక ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల మనతో పాటు మన ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు.

మనం రోజు వాడే కూరగాయలలో టమాటో ను చాలామంది ప్రజలు పచ్చిగా కూడా తింటూ ఉంటారు.అంతేకాకుండా టమాటో లేకుండా ఏ వంటకాన్ని కూడా తయారు చేయలేరు.

దాదాపు వరుసగా రెండు వారాలపాటు టమేటాని ఆహార పదార్థాలలో అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియాగా మారుతుందని ఒక అధ్యాయంలో తెలిసింది.దీనికోసం కొంతమంది శాస్త్రవేత్తలు జంతువుల్ని రెండు భాగాలుగా విభజన చేశారు.

Advertisement
Are There All The Health Benefits Of Eating Tomatoes , Tomatoes, Health Benefits

అయితే పీచు, చక్కర, ప్రోటీన్, కొవ్వులు క్యాలరీలు అన్ని ఒకే రకంగా ఉన్న ఆహారాన్ని రెండు విభాగాల్లో వాటికి తినడానికి ఇచ్చారు.ఇలా కొన్ని నెలల పాటు చేసిన తర్వాత వాటి మల పరీక్ష ద్వారా రెండు విభాగాలలో ఉన్న జంతువుల పొట్టలోని బ్యాక్టీరియా ఒకే లాగా ఉందని నిర్ధారించుకున్నారు.

దాని తర్వాత ఒక వర్గంలోని వాటికి మాత్రం టొమాటోలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే ఇచ్చారు.

Are There All The Health Benefits Of Eating Tomatoes , Tomatoes, Health Benefits

రెండు వారాల తర్వాత మళ్లీ రెండిటి మలన్ని పరిశీలించినప్పుడు టమాటో ఎక్కువగా తీసుకున్న జంతువులలో మైక్రోబయోమ్‌లో వైవిధ్యం ఎక్కువగా కనిపించిందట.అందులో బ్యాక్టీరియోడొటా అనే బ్యాక్టీరియా శాతం ఎక్కువగా ఉండటం వల్ల వాటి ఆరోగ్యం మెరుగైనట్లూ గుర్తించారు.అదే కాకుండా ఆహారంలో భాగంగా టమాటో ఎక్కువగా తిన్న వాళ్ళలో క్యాన్సర్ వ్యాధి తగ్గే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే టమాటో తినడం వల్ల జీర్ణాశయ సంబంధిత వ్యాధులు కూడా తగ్గే అవకాశం ఉంది.టమాటో లో ఉండే విటమిన్ సి వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు