ఆ హామీలే కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయా ?

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఆరు హామీలు.ఆరు గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో( Manifesto ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

  మహాలక్ష్మి పేరుతో రూ.500 లకే గ్యాస్ సిలిండర్ మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద ఏటా రూ.15000, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం.ఇలా ఐదు హామీలనే ప్రధానంగా నొక్కి చెబుతూ వీటి అమలు గ్యారెంటీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు హస్తం నేతలు.

అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఈ ఐదు హామీలే ఆ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయా ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.ప్రస్తుతం తెలంగాణలో ప్రకటించిన ఐదు హామీలు.

ఆల్రెడీ కర్నాటకలో ప్రకటించిన హామీలే.

ఇవే హామీలను అక్కడ ప్రకటించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు విషయంలో మాత్రం తడబడుతోంది కాంగ్రెస్ పార్టీ.ఇచ్చిన హామీలను పక్కన పెట్టేస్తున్నారని కాంగ్రెస్ పాలకులపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెట్టున్నాయి ఆ రాష్ట్రంలో.

Advertisement

ఇటీవల జెడిఎస్ అగ్రనేత కుమారస్వామి ( Kumaraswamy )కూడా కాంగ్రెస్ హామీల పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.అయిదు హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రకటించిన హామీలను ఆ పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసిందని విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు తెలంగాణలో( Telangana ) కూడా అవే హామీలు ప్రకటించి ఇక్కడి ప్రజలను కూడా మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఇటీవల కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.దీంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఎంత వరకు నమ్ముతారనే అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమౌతున్నాయట.దీంతో ఇచ్చిన ఐదు హామీల విషయంలో నెగిటివిటీ పెరిగిపోతుండడంతో మరికొన్ని కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చితే ఎలా ఉంటుందనే దానిపై కూడా ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారట.

మొత్తానికి కర్నాటక విన్నింగ్ స్ట్రాటజీతో తెలంగాణలో కూడా అధికారంపై కన్నేసిన హస్తం పార్టీకి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు