పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతుల పోరుబాట

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పోరుబాట చేపట్టారు.టీడీపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత యనమల మాట్లాడుతూ ఏపీలో ఆక్వా రంగం కుదేలైందని చెప్పారు.ఫీడ్, సీడ్, ఎక్స్ పోర్ట్, ప్రాసెసింగ్ లో ప్రభుత్వ వైఖరి వల్లే నష్టపోతున్నారని విమర్శించారు.

జగన్ ను గద్దె దింపాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టారని మండిపడ్డారు.

రాష్ట్రంలో హార్టికల్చర్ మైనస్ ఎనిమిది శాతానికి పడిపోయిందని తెలిపారు.ఆక్వా రంగం మైనస్ 14.2 శాతానికి పడిపోయిందని యనమల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు