ఏప్రిల్ లో ఏకంగా 5 పాన్ ఇండియన్ మూవీలు.. ఎంటర్టైన్మెంట్ వేరే లెవల్లో..

ప్రతీ నెల ప్రతీ వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.అయితే ఒక్కో నెలలో మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తుండడం జరుగుతుంది.

అలాగే సమ్మర్ లో కూడా వేసవి సెలవులను క్యాష్ చేసుకునేందుకు క్రేజీ సినిమాలు సిద్ధం అవుతున్నాయి.మరి ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే.

అందులో ముందు వరుసలో ఉంది మాస్ రాజా రవితేజ..

ఈ మధ్యనే రవితేజ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లను అందుకున్నాడు.ఇక ఇప్పుడు మరో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

Advertisement

సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ లీడ్ రోల్ లో నటించిన శాకుంతలం సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కాబోతుంది.

టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది.ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇదే రోజు లారెన్స్ రుద్రుడు సినిమా కూడా రిలీజ్ కానుంది.

లారెన్స్ సినిమాలకు మన తెలుగులో మంచి మార్కెట్ ఉంది.మరి ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ అవ్వనుంది.ఆ తర్వాత అదే రోజు అల్లరి నరేష్ నటించిన ఉగ్రం సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

దీని తర్వాత ఏప్రిల్ 28న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో పాటు కోలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 2 కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Advertisement

అలాగే ఏప్రిల్ 28న అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.ఇది కూడా పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ కాబోతుంది.ఏప్రిల్ 29న వైష్ణవ తేజ్ నటించే సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

ఇలా ఏప్రిల్ నెలలోనే ఏకంగా ఐదు పాన్ ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి.

తాజా వార్తలు