డార్క్ స్పాట్స్‌కు చెక్ పెట్టే యాపిల్ సైడెర్ వెనిగర్.. ఎలాగంటే?

డార్క్ స్పాట్స్‌. ఎక్కువ‌గా వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

ఎంత అందంగా, తెల్ల‌గా ఉన్నా డార్క్ స్పాట్స్ ఉంటే మాత్రం అంద‌హీనంగా క‌నిపిస్తారు.

అందుకే డార్క్ స్పాట్స్ ఉంటే.

వాటిని ఎలా త‌గ్గించుకోవాలా అని నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే డార్క్ స్పాట్స్‌ను త‌గ్గించ‌డంలో యాపిల్ సిడార్ వెనిగ‌ర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌.యాపిల్ సైడెర్ వెనిగర్ అంటే.

Advertisement
Apple Cider Vinegar Helps To Reduce Dark Spots! Apple Cider Vinegar, Reduce Dark

ఇది కూడా యాపిల్ జ్యూసే.కానీ, దీంట్లో ఈస్ట్ కలుపుతారు.

అందువ‌ల్ల‌, యాపిల్ సైడెర్ వెనిగర్ వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది.ఇక దీనిలో యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి.

డైరెక్ట్‌గా ఎవ‌రూ తీసుకోరు.వంటలు, సలాడ్స్, కేక్స్ వంటి వాటిలో వాడతారు.

అలాగే ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మంది ఉద‌యాన్నే దీనిని వాట‌ర్‌లో క‌లిపి తీసుకుంటున్నారు.అయితే ఆరోగ్య ప‌రంగానే కాకుండా.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

సౌంద‌ర్య ప‌రంగా కూడా యాపిల్ సిడార్ వెనిగ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

Apple Cider Vinegar Helps To Reduce Dark Spots Apple Cider Vinegar, Reduce Dark
Advertisement

ముఖ్యంగా డార్క్ స్పాట్స్ ఉన్న వారు.ఒక బౌల్‌లో ఒక స్పూన్ యాపిల్ సిడార్ వెనిగ‌ర్ వేసి.అందులో రెండు చుక్క‌ల ఎసెన్షియ‌ల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మంలో దూదిని ముంచి.ముఖాన్ని అప్లై చేయాలి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల డార్క్ స్పాట్స్ త్వ‌రగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో ఒక టీ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగ‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ వాట‌ర్‌లో దూదిని ముంచి ముఖానికి అద్దుకోవాలి.

వారానికి నాలుగు లేదా ఐదు సార్లు ఇలా చేస్తుంటే.డార్క్ స్పాట్స్ క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

అలాగే చ‌ర్మ రంధ్రాల్లోని మురికి, జిడ్డును తొలిగించి.ముఖాన్ని మెరిపించ‌డంలో యాపిల్ సిడార్ వెనిగ‌ర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

తాజా వార్తలు