ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాటను బుగ్గన నిజం చేస్తారా?

ఇక నా వల్ల కాదు.

జనవరి తర్వాత నేను కూడా కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నాను అని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నట్లు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ మధ్య తన కొత్త పలుకులో రాసుకున్నారు.

ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆయన మాటనే బుగ్గన నిజం చేసేలా కనిపిస్తున్నారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చూస్తూనే ఉన్నాం.మొన్న జీతాలు చెల్లించి, రైతు భరోసా సాయం ఇచ్చిన తర్వాత ఖజానాలో కేవలం వంద కోట్లు మాత్రమే మిగిలాయన్న వార్త కూడా వచ్చింది.ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌ ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడం అసాధ్యం.

దీనికోసం బిల్డ్‌ ఏపీ పేరుతో ఇప్పటికే ప్రభుత్వ భూములను అమ్మడానికి కూడా జగన్‌ సర్కార్‌ సిద్ధమైపోయింది.

Advertisement

పైగా ఇప్పటికే పథకాల అమలు కోసం ఇబ్బడిముబ్బడిగా అప్పులు కూడా చేసేసింది.అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 16 వేల కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది.అమరావతి, పోలవరం, ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో ఆదాయం భారీగా పడిపోయింది.

దీంతో కొత్తగా అప్పులు ఇవ్వడానికి కూడా ఏ బ్యాంకూ ముందుకు రావడం లేదు.రెండు, మూడు నెలల్లో ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన దుస్థితి వస్తుందన్న ప్రచారం నడుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో నెలకో కొత్త పథకం ప్రారంభించడం ఎలాగో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.అటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

వచ్చే జనవరి ఆయనకు ఓ గండంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి.ఆ ఒక్క నెలలోనే పథకాల అమలు కోసం అదనంగా పది వేల కోట్ల వరకూ అవసరమవుతాయి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఉన్న ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో పంచుతూ వెళ్తున్న ఈ పరిస్థితుల్లో అంత మొత్తం అదనంగా సమకూర్చడం అసాధ్యమే.దీంతో గతంలో చంద్రబాబు ప్రభుత్వం వల్లే ఏపీ ఇలా అప్పుల పాలైందంటూ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించడం మొదలుపెట్టారు.రానున్న నెలల్లో ఇదే ప్రచారాన్ని మరింత విస్తృతం చేసి చేతులెత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు