తెలంగాణా ప్రభుత్వమే బెటర్

విద్యార్థుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే తెలంగాణా ప్రభుత్వమే బెటర్.ఆంద్ర విద్యార్థుల మీద తెలంగాణా సర్కారు దయ చూపింది.

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసినవారు రెండో సంవత్సరం పరీక్షలు తెలంగాణాలో రాసుకోవడానికి అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

AP Students Can Write Inter 2nd Year Exams In Telangana-AP Students Can Write In

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ముగిశాక ఏవైనా కారణాలతో తెలంగాణాకు వచ్చినట్లయితే రెండో సంవత్సరం ఇక్కడే చదివి పరీక్షలు రాసోకోవచ్చు.అయితే ఈ వెసులుబాటు ఈ ఒక్క విద్యా సంవత్సరానికి మాత్రమె వర్తిస్తుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వెసులుబాటు ఇవ్వలేదు.తెలంగాణాలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది అయ్యాక ఆంధ్రకు వెళితే అక్కడ మళ్ళీ మొదటి సంవత్సరం చదవాలి.

Advertisement

ఈ నిబంధన వల్ల సమయం వృధా కావడమే కాకుండా, తల్లిదండ్రుల మీద చాల ఆర్ధిక భారం పడుతుంది.కానీ ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.

వచ్చే ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి హైదరాబాదులోని ఆంధ్రా ఉద్యోగులంతా విజయవాడకు తప్పనిసరిగా రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.కానీ తల్లిదండ్రులతో పిల్లలు వెళ్ళడం కష్టంగా ఉంది.

చదువులు మధ్యలో ఉన్న వారు ఆంధ్రాకు వెళితే తీవ్రంగా నష్టపోతారు.తెలంగాణాలో మంచి కాలేజీలో ఇంజనీరింగు చదివే విద్యార్థులు మధ్యలో ఆంధ్రాకు వెళితే పనికిమాలిన కాలేజీలో చేరాల్సి వస్తుంది.

పిల్లలను హైదరాబాదులో ఉంచి చదివించడం తలకు మించిన భారం అవుతుంది.ఏపీ ఉద్యోగులకు ఇది పెద్ద సమస్యగా ఉంది.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..
Advertisement

తాజా వార్తలు